కొట్టాయం (కధ) --మూర్తి కెవివిఎస్
పొగడ పూల వాసన ఎటునుంచో...గాలి లో తేలుతూ వచ్చి నాసికా పుటాల్ని తాకింది.ఒక్కసారి గా ఏవో పాత జ్ఞాపకాలు ఉన్నట్లుండి ముప్పిరిగొన్నాయి.నిన్న మొన్నటివి కావు.ఎక్కడో అణిగి మణిగి ఉన్న ఆలోచనలు మళ్ళీ ప్రాణం పోసుకున్నాయి.ఏవిటి...ఆ పూల సువాసన మస్తిష్కంలోని దొంతరల్లోకి ఎలా ప్రవేశించి నిద్రోతున్న గతాన్ని జీవింపజేయగలదు అని ఎవరైనా అడిగితే సమాధానం అంత సంతృపికరం గా చెప్పలేను.కాని అది ఒక ఇంద్రజాలం.
ఉమ ని మళ్ళీ చూస్తానని అనుకోలేదు. ఏ ప్రయత్నమూ లేకుండా కొన్ని సార్లు అలాజరిగిపోతుంది.అంతే.కొన్ని కాలానికి వదిలేస్తామా...కాలం మరిచిపోదు.తగిన సమయం లో తాను చేయవలసిన పని తాను చేస్తుంది.కొన్ని సార్లు దాన్నే విధి అని కూడా అంటాము.సరే ..ఏదైనా కానీ ..!జరిగింది అయితే అది.మంచికా..చెడుకా ..ఇంకో అందుకా ...చెప్పలేను ఒక మాట లో..!
కాలేజీ రోజులు గుర్తు కు వస్తే ఉమ లేకుండా ఆ జ్ఞాపకాలు ముగియవు.పాటల కోకిల ఆమె గూర్చి మరో మాట లో చెప్పాలంటే..!ఇంకా ఏవో ఊహించుకోవద్దు.అక్కడ ప్రేమా దోమా లాటివి ఏమీ లేవు.అంత సాహసం చేసే రోజులు కావవి.అయితే ఆమె లో ఏదో ప్రత్యేకత ఉంది.అదే ఉమ పట్ల ఆకర్షణ కి లోను చేసింది.అది ఇప్పటికీ అంతరంతరాళాల్లో కొనసాగుతూనే ఉన్నది.అదిగో అలాటి సమయం లోనే మళ్ళీ ఆమె కనిపించి ఆ రోజుల్ని జ్ఞప్తికి తెచ్చింది.
కొంత సాహసం చొరవ వంటివి తోడయితే ఆ రోజుల్లో మాది ఓ ప్రేమ కధ గా రూపొంది ఉండేదేమో...ఇంకా ఏమేమి జరిగి ఉండేవో ఇప్పుడు ఊహించలేను గాని ఏదో ఒక గుర్తు ఉంచుకునే విషయమే జరిగి ఉండేదేమో..!అయితే ఒకటి...ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాళ్ళందర్నీ ఒకే గాటన గట్టను గాని ..అసలు నిజంగా ప్రేమించిన వాళ్ళని పెళ్ళి చేసుకోవడం అందరకీ కలిసిరాదు కూడా ..!ఒకే ఇంటి కప్పు కింద రొటీన్ జీవితం ప్రారంభించిన తర్వాత ఒకరి మీద ఒకరికి విరక్తి కలిగి విడిపోయే స్థితికి రావడం..ఎంతమందిని చూడలేదు..!గనక కొన్ని సార్లు ప్రేమ ఫలించకపోవడమే మధురం..అది కొంత కాలం పోయిన తర్వాత గాని తెలియదు.
"ఆర్ యూ స్టిల్ ఇన్ రెవ్ రి...వస్తున్నావా... మీటింగ్ మొదలయింది" అడిగాడు జోస్.
"లేదు.చిన్న పని ఉంది.కాసేపటిలో జాయిన్ అవుతా.నువు నడువు"చెప్పాను.
నేను ఊహా లోకం లో తేలుతున్నట్లు ఇతను ఎలా కనిపెట్టాడు.ఈ మళయాళీలు చురుకయిన వాళ్ళే.తెరిచి ఉంచిన ఆ కిటికీ ని మూసివేశాను.పొగడ పూల వాసన ఇపుడు లోనికి రావడం లేదు.ప్రస్తుతం నేను ఉన్నది ఒక కాలేజ్ హాస్టల్ లో...అంటే విద్యార్థి గా కాదు.ఒక డెలిగేట్ గా .!ఒక అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ ఆహ్వానం మేరకు కేరళ లోని ఈ కొట్టాయం నగరానికి రెండు రోజుల క్రితం వచ్చాను.అతిథుల సంఖ్య ఎక్కువ గా ఉండటం తో కొంత మందికి బస ఇక్కడ ఏర్పాటు చేశారు.
సెయింట్ మార్తోమా సంస్థలకి చెందిన ఈ కాలేజ్ కేంపస్ విశాలం గా ఉన్నది.అటానమస్ విద్యాసంస్థ.మాకు బస ఇచ్చిన కాంప్లెక్స్ పక్కనే ఇంకో భవనం ఉంది.దాని ముందు "అరమన" అని రాసి ఉంది.దాని అర్ధం బిషప్ యొక్క ఇల్లు అని ట.జోస్ ఇక్కడ కి దగ్గర లో నే ఉన్న తిరువళ్ళా అనే ఊరి లో ఒక కాలేజ్ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు.ఈ మీటింగ్ ఏర్పాట్లు చూడటం,అతిథులను చూడటం ఇంకా ఇలాటి పనులు అన్నిటిలో నిర్వాహకులకి సాయం గా ఉండటానికి తను ఈ కొట్టాయం వచ్చాడు.
జోస్ పూర్తి పేరు జోసెఫ్ పరంబిల్.ఇక్కడ నాకు గైడ్ లేని లోటు కూడా తన వల్ల తీరి పోయింది.కలిసి నిన్నంతా కొన్ని ప్రాంతాలు తిరిగాము.దేశం లోనే ఒక గమ్మత్తైన రాష్ట్రం కేరళ.అవసరానికి మించి ఇతరులతో మిత్రత్వం ని పెద్ద గా నెరపరు.ఆడంబరం తక్కువ.ఉన్నంత లో తమ పరిసరాల్ని అన్నిటి ని శుభ్రంగా ఉంచుకుంటారు.కేరళ లోకి మా రైలు ప్రవేశించడం తోనే పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు బిల బిల మంటూ మా కోచ్ ల్లోకి ప్రవేశించి వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు.దిన,వార, మాస పత్రికల నుంచి కధల పుస్తకాలు నవలలు ఒకటేమిటి అన్ని రకాల పుస్తకాల్ని జనాలు పరిశీలిస్తూ కొనసాగారు.వేరు శనక్కాయలు ,సమోసాలు లాంటివి సరే గాని ఈ సంస్కృతి వింత గానే తోచింది.కేరళీయుల పుస్తక ప్రేమ ఇక్కడనుంచే కనిపించింది.శాస్త్రి రోడ్ లోని ఒక హోటల్ లో మొదటి రోజు ఉండి ఆ తర్వాత ఇక్కడకి మారాను.ఎంత దూరం పోయి చూసినా పాన్ షాప్ లు ఎక్కడా కనపడలేదు గాని పుస్తకాల షాప్ లు మాత్రం బాగా ఉన్నాయి.ఇంగ్లీష్,మళయాళం పుస్తకాలు ఎక్కువగా కనిపించాయి.
మీటింగ్ జరుగుతున్న హాల్ లోకి ప్రవేశించాను.దక్షిణాది వారితో బాటు ఉత్తరాది వాళ్ళు,ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు ఉన్నట్లు తోచింది.ముఖ్య అతిధులు గా ఈ సంస్థ చైర్మన్ డేవిడ్ కొచెరిల్ తో పాటు మార్తోమా చర్చ్ కి చెందిన బిషప్ ఇంకా కొంతమంది ఉన్నారు.ఇక్కడ బిషప్ కి ఉండే ప్రాభవం ఒక కలెక్టర్ కంటే కూడా ఎక్కువ అని చెప్పవచ్చు.
నిశ్శబ్దం గా వెళ్ళి నాకు కేటాయించిన వరుస లో కూర్చున్నాను.గత సంవత్సరం చేసిన కార్యక్రమాల గురించి చర్చ నడుస్తోంది.
" మీరు ఎక్కడ నుంచి వచ్చారు..?" నా పక్కనే కూర్చున్న ఒకాయన్ని అడిగాను.నన్ను నేను పరిచయం చేసుకుంటూ ..!ఇక్కడ జరిగే సంభాషణలన్నీ ఇంగ్లీష్ లోనే సాగుతున్నాయి.అది వేరే చెప్పనవసరం లేదు.
"నేను బెంగళూరు నుంచి వచ్చాను...పేరు రామె గౌడ " అన్నాడతను చిరు నవ్వుతో.
" మీ ప్రాంతం లో సంస్థ యాక్టివిటీస్ ఎలా నడుస్తున్నాయి.."
" మన చేతిలో ఉన్నది మనం చేస్తున్నాము.పరవా లేదు...ఎప్పుడైనా మా ఏరియా కి రండి"
"తప్పకుండా .."
మా వంతు వచ్చి మాటాడేసరికి సాయంత్రం దాటింది.విచిత్రం గా గౌడ కి కేటాయించిన రూం నా ముందు ఉన్నదే..గనక రాత్రి భోజనాలు అవడానికి ముందు ఏదైనా డ్రింక్ తీసుకుందాం రమ్మని ఆహ్వానించాడు.నేను సున్నితం గా తిరస్కరించాను.అయితే ఆ తెల్లారి పొద్దున స్నానాలు అవీ కానిచ్చేసి నా రూం కి వచ్చాడు.
" ఎలా గడిచింది రాత్రి.." అడిగాను అతడిని.
" సూపర్. మీరు కూడా వస్తే బాగుండేది..." అన్నాడు గౌడ.
" రాష్ట్రం దాటి వస్తే వాటన్నిటికి దూరం గా ఉండాలనేది నా ఫిలాసఫి ...దానికీ కొన్ని కారణాలు ఉన్నాయి " చెప్పాను.
" ఒక రకంగా మంచిదే అది.ఈ రోజు మనని అందరని సైట్ సీయింగ్ ట్రిప్ కి తీసుకెళుతున్నారు.వస్తున్నారుగా .."
"అయ్యో రాకపోవడమా ...ఈ కేరళ లో చివరి దినాన్ని కాస్త ఆనందం గా నే ముగిద్దాము.."
పది గంటలకి మా బస్ లు బయలు దేరాయి.ముందుగా కుమారకోం వద్ద నున్న బర్డ్ సాక్చ్యూరి నుంచి మొదలు పెట్టి వెంబనాడ్ లో ని సముద్ర జలాల్లో బోట్ షికారు ఆ తరవాత వైకోం లోని ఓ ప్రాచీన ఆలయం అలా చూసుకుంటూ పోతున్నాం.ఏ వైపు చూసినా పచ్చదనమే పచ్చదనం.ఇవి చాలవన్నట్లు ఇళ్ళలో కూడా తోటల పెంపకం.అసలు ఎక్కడకి వెళ్ళినా మతి పోయే పచ్చదనం..అడవుల మధ్యన ఇళ్ళూ కట్టుకుని నివసిస్తున్నారా వీళ్ళు అనిపించింది.ప్రకృతి ఇచ్చినదాన్ని కాపాడుకోవడం కూడా ఓ గొప్ప విషయమే.ఇది చాలాదన్నట్లు ఊర్ల మధ్య లోకి చొచ్చుకు వచ్చిన సముద్ర జలాలు.ఒక వీధినుంచి మరో వీధి లోకి పోవాలంటే కొన్ని మార్లు పడవ దాటి వెళ్ళవలసిందే.
బస్ లో రామె గౌడ,నేను పక్క పక్క నే కూర్చున్నాము.
"ఇది వరకు ఎప్పుడైనా కేరళకి కి వచ్చారా మీరు" ప్రశ్నించాను.
"అనేక సార్లు వచ్చాను.నా వైఫ్ ది ఈ రాష్ట్రమే.అయితే వాళ్ళు కర్నాటక లో స్థిరపడ్డారు.కాబట్టి వస్తూనే ఉంటాము.." చెప్పాడు రామె గౌడ.
" చాలా అదృష్టవంతులు.ప్రకృతి మధ్యలో గడిపే అవకాశం...మీకు బాగానే లభిస్తుంది .."
"ఈ కేరళ కి ఉన్న ఆస్తులు రెండే రెండు ..ఒకటి విద్య రెండవది ప్రకృతి సంపద.పెద్ద పెద్ద పరిశ్రమలు చాలా తక్కువ "
"కనుకనే ప్రకృతికి సంబందించి పర్యాటక రంగం లో ముందున్నది.దేశం లో కెల్లా గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కువ గా కేరళీయులే ఉన్నట్లు ఒక సర్వే..."
"ఆ వ్యవహారాలు చూడటానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖయే ఈ రాష్ట్రం లో ఉన్నది.ఎక్కువ ఆదాయం ఆ విధం గానే వస్తుంది"

బస్ రివ్వున సాగిపోతోంది.రోడ్డు కి అటూ ఇటూ ఎత్తుగా పెరిగిన రబ్బరు చెట్లు.చెట్ల కి చుట్టూతా కట్టిన ముంతలు.గ్రామాల లోని,పట్టణం లోని వాతావరణం అంతా పచ్చ గా నే ఉన్నది.జనాలు ఇంటి ముందు నిలబడో కూర్చొనో మాట్లాడుకునే దృశ్యాలు కనబడటం లేదు.కొన్ని ఇళ్ళు నిర్జనం గా ,తాళాలు వేసి కనిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని గౌడ ని అడిగాను.
" మెరుగైన సంపాదన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం వీరికి సర్వ సహజం.యువతులు కూడా చేపల ప్రాసెసింగ్ యూనిట్ లలో పని చేయడానికి కలకత్తా కి కూడా వెళ్ళిపోతుంటారు.ఇక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ల లో ఇక్కడి టీచర్లకి ఉండే డిమాండ్ తెలిసినదే.మంచి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఆడ మగా అని తేడా లేకుండా ఏ రాష్ట్రమైనా వెళ్ళిపోతుంటారు.మంచి వేతనం లభిస్తే చాలు..!" చెప్పాడు గౌడ.
"సరే...వీళ్ళ వ్యాపార కళ మనకి తెలిసిందే. మా చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కేరళ వారి హోటల్స్ ఉండేవి.ఇప్పుడు కొద్దిగా తగ్గినట్లు ఉంది ఉరవడి.."
"ఏముంది...ఇతర రంగాలు బాగున్నాయనుకుంటే దాని లోకి పోతారు.మోడలింగ్,సినీ పరిశ్రమ ఇలా ఎన్నో చెప్పుకుటూ పోతే..ఎటు తిరిగి ఇంజనీరింగ్ ,మెడిసిన్ పిచ్చి మన కర్నాటక ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనే జాస్తి.." నవ్వుతూ అన్నాడు గౌడ.
అంతలోనే జోస్ ముందు సీటు లో నుంచి లేచి నిలబడ్డాడు.గౌడ చేయి ఊపి మళయాళం లో ఏదో గట్టిగా చెప్పాడు.అలాగే అన్నట్టు తను తల ఊపాడు.
"ఏమిటి విషయం.." అడిగాను గౌడ ని.
"దగ్గర్లో "పుట్టు" అనే టిఫిన్ దొరికే హోటల్ ఉంటే అక్కడ ఆపమని చెప్పాను.కేరళ స్పెషల్స్ లో అది ఒకటి.రుచి చూడండి.."
"బాగుంటుందా .."
"అదంతా ..తర్వాత.ఏ ప్రాంతం వెళ్ళినా లోకల్ వంటకాల్ని కొన్ని రుచి చూడాలి.కొబ్బరి తో చేస్తారు దాన్ని..."
బస్ ఆపిన తర్వాత ఆ పుట్టు ని రుచి చూశాము.కొబ్బరిని కోరి దానికి మిరియాలు ఇంకా ఏవో కలిపి తయారించారు దాన్ని.అనుకున్నంత గొప్ప గా లేదు అలాని చెత్త గానూ లేదు.నాకు అది ఆనక ఇంకా ఏదైనా టిఫిన్ ఇమ్మంటే ఒక గుడ్డు,దానిలో కి బఠానీ కూర ఇచ్చాడు.ఇదేదో గమ్మత్తు గా ఉందని లాగించాను.బాగానే అనిపించింది.
" మిత్రమా ..ఎలా ఉంది పుట్టు " అడిగాడు జోస్.కొన్నిసార్లు నిజాలు చెప్పడం అంత దుర్మార్గం ఇంకోటి ఉండదు.
"చాలా అద్భుతం గా ఉంది.." నవ్వుతూ చెప్పాను.
" మీరు అనుకున్నట్లుగా ఉందా మా ప్రాంతం ..ఎలా ఉంది..?" జోస్ ప్రశ్నించాడు.
" దేశం మొత్తం లో ఎక్కడ మత కల్లోలాలు జరిగినా ఇక్కడ మూడు మతాల జనాభా గణనీయం గా ఉన్నప్పటికీ అలాంటివి జరిగిన దాఖలాలు ఉండవు.అది మేము ఆదర్శం గా చెప్పుకుంటాము మీ గూర్చి.."
"ఇక్కడ మతాంతర వివాహాలు కూడా అతి సహజం.ఇంచు మించు ప్రతి రెండు మూడు కుటుంబాలలో వేరే మతం వారి తో వివాహాలు జరిగిన దృష్టాంతాలు కనబడతాయి.గొడవలు వేరే రకంగా ఏమైనా ఉంటాయేమో గాని మతపరమైన అల్లర్లను ఏ వర్గమూ ఇక్కడ అనుమతించదు.."
అంతలోనే రామె గౌడ అందుకుని చెప్పాడు."జోస్ చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం" అని..!
ఆ రోజు ఆనందం గా అలా గడిచిపోయింది.తెల్లారితే తిరుగు ప్రయాణం.రామె గౌడ కి నాకు ఒకే కోచ్ లో సీట్లు దొరక లేదు గాని ఎలాగో ప్రయత్నించి నా ముందు ఉన్న ఖాళీ బెర్త్ ని ఆక్రమించాడు.బెంగళూరు చేరే దాకా ఏదో మాటాడుతూనే ఉన్నాడు.మధ్య మధ్య లో కునికిపాట్లు పడుతూనే..!కర్నాటక రాష్ట్రం లో రైలు ప్రవేశించేసరికి మన వాడి టోన్ లో మార్పు వచ్చింది.
" ఒక సంగతి తెలుసా..?ఈ కేరళ లో అమ్ముడైనంత మద్యం ఇంకెక్కడా అమ్ముడు కాదు దేశం లో..!బీఫ్ తినడం లో వాళ్ళూ వీళ్ళూ అని లేదు ..హిందువులూ పోటీ పడతారు.ఏ పారిశ్రామికవేత్త ని సరిగా వ్యాపారం చేసుకోనివ్వరు..యూనియన్ల పేరు మీద..!అందుకే పెద్ద ఇండస్ట్రీ లు రావు...దాని మీదట ఇలా వలసలు పోతుంటారు..." అలా చెప్పుకుపోతున్నాడు.
" ఏ రాష్ట్ర ప్రత్యేకతలు వాటికి ఉంటాయి. నూటికి నూరు శాతం అక్షరాస్యత ,వైద్యం ని ప్రతి గ్రామానికి తీసుకుపోవడం,స్త్రీ సాధికారత ని సాధించడం ఇలా చాలా వాటిల్లో అభివృద్ది సాధించారు గదా .." నా అభిప్రాయాన్ని చెప్పాను.అయినా కేరళ లో ఉన్నప్పుడు ఒక్క ముక్క వ్యతిరేకంగా మాటాడని ఈయన ఇలా ప్లేట్ ఫిరాయించాడేమిటబ్బా ఇప్పుడు..ఓహో స్థాన బలం అనుకుంటాను.ఇక ఎక్కువ వాదించదలచుకోలేదు.రైలు దిగితే ఎవరం ఎక్కడో ..ఈ మాత్రం దానికి వేడి వేడి డిస్కషన్ లు ఎందుకులే అనిపించింది.ఎట్టకేలకు తను దిగిపోయాడు.
తెలుగు రాష్ట్రం లో కి ఎంటర్ అవుతూనే నా మొబైల్ నుంచి అతనికి ఒక మెసేజ్ పెట్టాను." భారత దేశం లోని ఏ రాష్ట్రం మరో రాష్ట్రం లా ఉండదు.అదే సమయం లో సారూప్యతలూ ఉంటాయి.ఎంత ఎక్కువ ఈ నేల లో తిరుగుతుంటే అంత ఎక్కువ ఈ ప్రజల పై ,ప్రాంతాలపై అభిమానం పెరుగుతుంది. నాకైతే అదే అనుభూతి కలిగింది.నేనేదో ఊరికే చెప్పడం లేదు.ఏదో ఒకరోజు కి నీకూ అదే అనుభూతి కలుగుతుంది.మిత్రమా ,సర్వేంద్రియాల్ని తెరిచి ఉంచు..చాలు ..!" --- Murthy Kvvs

"మిత్రత్వం ని"? మిత్రత్వాన్ని అనండి మూర్తిగారూ. నిజానికి "మిత్రత్వం ని పెద్ద గా నెరపరు" బదులు "పెద్దగా మైత్రి నెఱపరు" అంటే ఇంకా బాగుంటుంది.
ReplyDelete"కొన్నిసార్లు నిజాలు చెప్పడం అంత దుర్మార్గం ఇంకోటి ఉండదు." -- good one!
కథ బాగుందండీ.