ఆన్ లైన్ ప్రపంచం లో కి వచ్చిన తర్వాత ఇది ఒక గమ్మత్తైన అనుభవం.ఎన్ని రకాలైన మనుషులు.తెలిసి అంటారో అలవోకగా అంటారో గాని ఎక్కడాలేని లాయల్టీ లు ,ఒకరిని మెప్పించడానికో,మరి తమ మనసులో ఉన్నదే అంటారో తెలియదు గాని విపరీతమైన భావజాలాలు.ఒక్కోసారి అవి తెలిసి పోతూనే ఉంటాయి.జనాల కోసం కొన్ని.తమ మనసులోవి కొన్ని.ఇంకా కొన్ని ఏవో ఆశించి.
భారత దేశం వింత అయిన ప్రదేశం.ఇక్కడున్న విభిన్నత ఎక్కడా ఉండదేమో.ఎవరు ఎలా అయినా మాటాడచ్చు.మళ్ళీ దాన్ని కాదని బుకాయించనూ వచ్చు.దేనిని పెద్ద సీరియస్ గా తీసుకున్నట్లు ఉండదు.జనాలు అంతే.ఆపైన వారూ అంతే.పిచ్చిగాని యధాప్రజా తధా రాజా.
*....* ......* .........*
బైబిల్ ని విమర్శించేవారొకరు... ఖురాన్ ని విమర్శించేవారొకరు...ఇంకా హిందూ గ్రంధాల్ని విమర్శించేవారొకరు...! అంతకు ముందే తాము ఏర్పరుచుకున్న భావాజాలానికి, ఎవరో చెప్పినదానికి ప్రభావితం కాబడి ముందూ వెనుకా చూడకుండా ఏదో రాసే వారు ఇంకొందరు.మేధావులు గా చలామణీ అయ్యే వారూ అదే తంతు.మరి ప్రతి ఒక్కరూ ఆ మత విషయాల్ని తూచ తప్పక పాటిస్తున్నారా నిజ జీవితం లో.అది సాధ్యమా..?
ఏ మత గ్రంధమైనా ఆ కాలానికి తగిన సందేశం అందించింది.అలానే సర్వకాలాలకు పనికి వచ్చి కొన్ని సంగతుల్ని తెలిపి ఉండవచ్చు.అంత మాత్రాన ఏదీ మనిషిని మించినది కాదు.మనిషి లేక పోతే మతం కూడా లేదు.అసలు మతం అనేది చాలా అపార్ధానికి గురి కాబడిన భావన.ఏ ప్రవక్త తన జీవిత కాలం లో తాను ఈ మతాన్ని స్థాపిస్తున్నట్లు చెప్పలేదు.
వారి తరువాత వచ్చిన అనుయాయులు చేసిన ఒక కట్టుబాటు ..క్రమేణా ఒక మత భావనని సంతరించుకున్నది.అది ఆ పిమ్మట రాజకీయ ఏకీకరణకి ,మనుషుల్ని దగ్గర చేయడానికి ఉపయోగించబడినది.ఇది నేను ఏవో ఊసుపోక చెప్పటం లేదు.ప్రధానమైన మూడు మత గ్రంధాల్ని చదివి న తర్వాత నాకు ఏర్పడిన భావమది.
సత్య వాక్పరిపాలన కోసం...తాను ఒకరికి ఇచ్చిన మాట కోసం ఎండా వాన ని కూడా లెక్క చేయకుండా ఒక వీధి చివర నిలబడి ఒక రోజంతా నిలబడి నిరీక్షించిన మహమ్మద్ ప్రవక్త యొక్క గాధ ని నీవు ఎప్పుడైన చదివావా అని నా హిందూ సోదరుడిని కొన్ని సార్లు అడగాలనిపిస్తుంది.ప్రేమ అ న్నిటిని సహించును.. అని ప్రపంచా ని కి చాటిన ప్రేమ యోగి యొక్క పలుకుల్ని నీ అంతట నీవు ఆ గ్రంధం లో చదివా వా అని అడగాలనిపిస్తుంది...ఒకరు ఎక్కడో ఉటంకించినవి కావు...భాష్యం చెప్పినవి కావు.మన అంతట మనం చదివితే దాని లోతు తెలుస్తుంది.
ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచం భ్రమ కి లోనయిన ప్రపంచం.స్వ ప్రయోజనాలకోసం మతాన్ని ఒక వస్తువు లా ఉపయోగించుకునే ప్రపంచం.కనుక ఒకరు చెప్పేది కాక చదివి మనకి మనమే అర్ధం చేసుకోవలసిన తరుణం.Murthy kvvs
No comments:
Post a Comment