Thursday, December 6, 2018

నా శ్రీలంక ప్రయాణం (కొన్ని సాధారణ దృశ్యాలు)


నగరాలు ఇంచు మించు కొంత తేడా తో ఒకేలాగా ఉంటాయి.ఒక దేశం యొక్క గ్రామీణ ప్రదేశాలు,ఇంకా సాధారణ ప్రజానీకం నివసించే విధానం లో భిన్నత్వం ఒక ఆసక్తి ని కలిగించేది గా ఉంటుంది.అది ఏ దేశం అయినా..!అందుకు శ్రీ లంక మాత్రం భిన్నం ఎందుకు అవుతుంది..?కొలొంబో నుంచి అనురాధపుర కి ప్రయాణించే దారి లో కొన్ని ఊళ్ళు కనబడగా వాటిని ఫోటోలు తీశాను.ఒక తల్లి పిల్ల వాడిని ఎత్తుకుని ఉన్నది.ఇంకా ఆ ఇల్లు నిర్మాణ దశ లో నే ఉన్నట్లుంది.నన్ను ఆకట్టుకున్న అంశాల్లో ఒకటి ఏమిటంటే ఇంటి నిర్మాణ శైలి.పైన రూఫ్ స్లోప్ గా ఉండి కురిసే వాన చినుకులు కింద పడిపోవడానికి అనువుగా ఉన్నాయి.మళ్ళీ ..లోపల కూడా గదులు వరస గా కాకుండా ఏ గది ఆ గది వేరు వేరు గా ప్రత్యేకంగా ఉన్నది.డేనిష్,డచ్,పోర్చ్ గీస్ ఇంకా బ్రిటీష్ వాళ్ళు పాలించబట్టి అనుకుంటా వాళ్ళ నిర్మాణ శైలి ని అనుకరించినట్లు ఉన్నది.శుభ్రత బాగుంది.ప్రతి ఇంట్లో పూల మొక్కలు ఉన్నాయి.


ఫ్రాక్ లు,షర్ట్ లు వేసుకున్న స్త్రీలు ఎక్కువ గా కనిపిస్తున్నారు.ఎక్కువమంది బుద్దిష్ట్ లు గానే ఉన్నారు.గ్రామ ప్రాంతాల్లో ని సెంటర్ ల లో బుద్దుని ప్రతిమ లు చాలా అందం గా ఉంచారు.దాని చుట్టూ అద్దాలు పెట్టారు.సింపుల్ గానూ,నీట్ గానూ ఉన్నాయి.అనవసరమైన ఆడంబరం ఎక్కడా కనిపించలేదు.ఫ్లయ్ యాష్ బ్రిక్స్ తో గోడ నిర్మించి సిమెంట్ చేస్తున్న ఇళ్ళు కనిపించాయి. మంచి మోడల్ గా  ఉన్నాయి.ప్రకృతి దృశ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే.శ్రీలంక అంతా నే చూసిన మేరకు ఆకు పచ్చగా నిగ నిగ లాడుతూ ఉన్నది.


శ్రీలంకేయులు మౌలికంగా శాంతిప్రియులు గా తోచింది.మేము అనురాధపుర లో హెరిటేజ్ హోటల్ లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది.అక్టోబర్ రెండు గాంధి గారి జయంతి.మనకి తెలిసిందే.మా హోటల్ లో ఉన్న కొంతమంది భారతీయ మిత్రులు ఆయన స్మృతి లో ఒక కార్యక్రమం చేస్తున్నాం రమ్మంటే వెళ్ళాను.నివాళి అన్నమాట.యధాప్రకారం స్పీచ్ లు ఇచ్చిన తర్వాత మన వాళ్ళు భారత్ మాతా కీ జై అని అరవడం చేస్తున్నారు.మళ్ళీ పెద్ద సౌండ్ తో.హోటల్ లోని ఆ దేశపు  స్టాఫ్ కొంత ఇబ్బంది గా ముఖం పెట్టారు.ఒక డ్రైవర్ మాత్రం మా వైపు తీవ్రంగా చూశాడు.కొంపదీసి ఇది జాతుల గొడవ గా మారదు గదా అని తోచింది ...అసలే ఇప్పుడిప్పుడే రెండు దేశాల వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తున్నాయి,అంతర్యుద్ధం తర్వాత..! అలాంటిది ఏమీ జరగలేదు.లేచిన వేళ బాగుంది.

No comments:

Post a Comment