Tuesday, December 18, 2018

స్విమ్మింగ్ ని మించిన వ్యాయామం ఏముందని..అన్ని అవయవాలు చక్కగా కదులుతాయి.మెడిటేషన్ సరే..సరి.



ఇప్పుడు ఒక మిత్రుని గురించి చెప్పాలి.నా శ్రీలంక ప్రయాణం లో ఎంతో సహకరించిన వ్యక్తి.అందరకీ తలలో నాలుక లా మెలుగుతూ అన్ని వయసుల వారి తో కలిసిపోయి ఒక పనిని నడిపించడం లో ప్రజ్ఞాశీలి.ఆయన వయసు ఎనభై నాలుగు అని చెప్పినపుడు ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.ఇంతకీ ఆయన పేరు సి ఎన్ ఎన్ రాజు గారు.కర్నాటక రాష్ట్రం లోని బెంగుళూరు ఆయన నివాసం అయినప్పటికీ సేవా కార్యక్రమాలలో దేశ విదేశాలు అలవోకగా చుట్టివస్తుంటారు.మీ ఆరోగ్య రహస్యం ఏమిటండి ఈ వయసు లోను ఇంత చురుకు గా ఉన్నారు అని అడిగినప్పుడు "ప్రతి రోజు ఉదయం తప్పకుండా స్విమ్మింగ్ చేస్తాను.ఆ తర్వాత కాసేపు ధ్యానం చేసుకుంటాను. అంతే.." ప్రత్యేకించి ఇంకేమీ లేదు అన్నారు.బాగా ఆలోచిస్తే అనిపించింది అసలు స్విమ్మింగ్ ని  మించిన వ్యాయామం ఏముందని..అన్ని అవయవాలు చక్కగా కదులుతాయి.మెడిటేషన్ సరే..సరి.

అనేక ఆలయాలకి ట్రస్టీ గాను ,భారతీయ వికాస పరిషత్ ,బెంగుళూరు శాఖ కి ముఖ్య బాధ్యులు గాను ఉన్న ఆయన పర్యటన అంటే చెవి కోసుకునే వ్యక్తి.ఈ మధ్య మడికేరి ప్రాంతం లో ఒక మిత్రుని పెళ్ళికి వచ్చినపుడు కొడగు సాంప్రదాయ దుస్తుల లో ఉన్న వారి తో కలిసి ఆయన దిగిన ఫోటో తో ఇక్కడ పరిచయం చేస్తున్నాను.అన్నట్టు ఈయన కర్నాటక రాష్ట్ర ఖాదీ బోర్డ్ లో ఉన్నతాధికారి గా పనిచేసి రెండు దశాబ్దాల పై చిలుకు క్రితమే రిటైర్ అయి శేష జీవితాన్ని అలా జీవిస్తున్నారు.

No comments:

Post a Comment