"The Racketeer" అనే ఈ ఆంగ్ల నవల ని ఈ కరోనా సమయం లో చదివిన పుస్తకాల లో ఒకటి గా చెప్పాలి.John Grisham రాసిన మరో లీగల్ థ్రిల్లర్ ఇది.అసలు రాకెటీర్ అంటే ఎవరు..?One who obtains money illegally,as by fraud,extortion,etc. అని రచయిత ముందు పేజీ లోనే చెబుతాడు.
ఇలాంటి లీగల్ సబ్జక్ట్స్ తీసుకొని రాయడం లో జాన్ గ్రీషం అందె వేసిన చెయ్యి. స్వయం గా న్యాయ వాది గా పనిచేసినందు వల్ల అనుకుంటా, ఈయన కోర్ట్ లో జరిగే వ్యవహారాల్ని నైపుణ్యం తో రాసిన అనుభూతి ని మనం పొందుతాము.సరే..అక్కడ అమెరికా లో అటార్నీ అంటారనుకోండి లాయర్ ని.
ఇంతకీ రాకెటీర్ ఎవరు..? అక్కడికే పోదాము. కధ ని ప్రధాన పాత్ర అయిన Malcolm Bannister అనే లాయర్ స్వగతం గా వివరిస్తూంటాడు. "నేను ఒక లాయర్ ని,అయితే ప్రస్తుతం జైలు లో ఉన్నాను.చెప్పాలంటే ఇది ఓ పెద్ద కధ." అంటూ మొదలవుతుంది.Bannister కి 43 ఏళ్ళు.వాషింగ్టన్ డి.సి. లోని ఫెడెరల్ జడ్జ్ విధించిన 10 ఏళ్ళ జైలు శిక్ష ని అనుభవిస్తున్నాడు.సగం శిక్ష దాకా పూర్తి కావచ్చింది.వర్జీనియా స్టేట్ బార్ అతని లైసెన్స్ ని రద్దు చేసింది,కనుక తను టెక్నికల్ గా న్యాయవాది నని చెప్పుకోవడానికి లేదు. అయితే తను ఉంటున్న "Frostburg" జైలు లోని చిన్నా చితకా ఇంకా కొందరు అనుభవం ఉన్న ఖైదీ లకి న్యాయ సలహాలు వారు అడిగితే ఇస్తూంటాడు. డ్రగ్ సంబంధ నేరాల నుంచి ఇంకా తీవ్ర నేరాలు చేసిన వారు వీరి లో ఉంటారు.
ఇంతకీ Bannister ఎందుకు జైలు కి వచ్చినట్లు..? లా పూర్తి చేసిన తర్వాత తను ఓ చిన్న పట్టణం లో Winchester లో ప్రాక్టీస్ మొదలు పెడతాడు. ఒక మిత్రుని సలహా మేరకు ఒక బిజినెస్ టైకూన్ కి సంబందించిన ఆస్తుల కొనుగోలు విషయం లో తన సేవలు అందిస్తాడు.అయితే తన ఖర్మ గాలి దీని లో చేయని నేరానికి ఇరుక్కుంటాడు Bannister.ఆ బిజినెస్ టైకూన్ తన ధనాన్ని మనీ లాండరింగ్ ద్వారా దేశం లోకి రప్పించి ఇలాంటివి చేస్తుంటాడు.
అమెరికా చట్ట సభ లో దీని మీద పెద్ద దుమారం రేగి న్యాయ విచారణ కి ఆదేశించినపుడు దాని లో ఈ Bannister ని కూడా చేర్చడం తో తనకీ శిక్ష పడుతుంది.యధాలాపం గా జైలు (వాళ్ళ భాష లో కరెక్షనల్ సెంటర్) లో ని లైబ్రరీ లో పేపర్ చదువుతున్నపుడు ఒక వార్త Bannister ని ఆకర్షిస్తుంది. అదేమిటంటే వర్జీనియా దక్షిణ జిల్లా కి చెందిన ఒక జడ్జ్ హత్య గావింపబడతాడు. అతని పేరు Raymond Fawcett ,తనకి తెలిసి అమెరికా న్యాయ చరిత్ర లో ఇంత వరకు కేవలం నలుగురు జడ్జ్ లు మాత్రమే హత్య చేయబడ్డారు.ఇది అయిదవ ఉదంతం.FBI ఎన్నో గాలింపులు జరుపుతుంది.సరైన ఆధారాలు దొరకడం కష్టం గా మారుతుంది.
అప్పుడు Bannister జైలు అధికారుల ద్వారా ఒక ప్రతిపాదన చేస్తాడు.న్యాయస్మృతి లోని ఒక క్లాజ్ ని ఉదహరించి దాని ప్రకారం తన ని బేషరతు గా విడుదల చేసి ,తన Identity ని అంటే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపు రేఖలు మార్చి ,సరికొత్త పౌరసత్వం ఇచ్చినట్లయితే ఆ నిందితుడి ని తాను పట్టించేందుకు సహకరిస్తానని,దానిలో ఎలాంటి పొరబాటు జరగడానికి ఆస్కారం ఉండదని ప్రతిపాదిస్తాడు.ఈ సందర్భం లో ఎంతో చర్చ Bannister కి FBI కి మధ్య నడుస్తుంది.మానవ హక్కులకి సంబందించిన విషయం లో ఆ దేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది అనిపిస్తుంది అది చదువుతున్నప్పుడు.
సరే అని ప్రభుత్వం తరపున ఒప్పుకున్నట్లు గా FBI ప్రకటించి తర్వాత కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. (మిగతాది వచ్చే భాగం లో) ----Murthy Kvvs
No comments:
Post a Comment