Saturday, September 27, 2025

సెమెటిక్ భాషలు అంటే...

 తరచుగా మనం సెమిటిక్ లేదా నాన్ సెమిటిక్ భాషలు గురించి పేపర్లలో చదువుతుంటాం. అలాగే సెమిటిక్ లేదా నాన్ సెమెటిక్ మతాలు అనే మాట కూడా వింటూంటాం. కాని చాలామందికి ఈ విషయం లో కొన్ని సందేహాలు ఉంటాయి. ఏవి సెమిటిక్ భాషలు లేదా సెమెటిక్ మతాలు అని. మిడిల్ ఈస్ట్ దేశాల్లోనూ,నార్త్ ఆఫ్రికా లో ఉన్న దేశాల్లోనూ, హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాల్లోనూ మొత్తం మీద 330 మిలియన్ల ప్రజలు సెమెటిక్ భాషలు మాట్లాడుతుంటారు. ముఖ్యమైన భాషలు వీటిల్లో చెప్పాలంటే అరబిక్,హిబ్రూ,అరామిక్ భాషలుగా చెప్పాలి.దీంట్లో అరబిక్ భాష చాలా విస్తారంగా మాట్లాడుతారు. సెమెటిక్ అనే పదం షెం అనే నోవా కుమారుడి పేరు మీద వచ్చింది.

ఇక సెమెటిక్ మతాలు- జూడాయిజం,క్రిస్టియానిటి,ఇస్లాం ఈ మతాల్ని సెమెటిక్ మతాలుగా వ్యవహరిస్తారు. అంటే పశ్చిమాసియా లో జన్మించిన మతాలుగా చెప్పవచ్చు. ఇరాక్, ఇజ్రాయెల్, లెబనాన్, ఈజిప్ట్,ఇథియోపియా,అల్జీరియా లాంటి దేశాల్ని సెమెటిక్ దేశాలుగా పేర్కొంటారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ మూడు మతాల్ని అబ్రహామిక్ మతాలుగా పిలుస్తారు. కారణం ఈ మూడు మతాలు అబ్రహాం ని మొదటి ప్రవక్త గా భావిస్తాయి.దానివల్ల ఆయన పేరు మీదుగా అలా పిలుస్తారు. అబ్రహామిక్ మతాల్లో ఉండే కామన్ పాయింట్ ఏమిటంటే ఏకోశ్వరోపాసన. యూదులు యొహావా లేదా ఇలోహిం,లేదా హాషెం ని సర్వసృష్టికర్త గా భావించి పూజిస్తారు.


  

No comments:

Post a Comment