Tuesday, June 19, 2012

పేరంటపల్లిని దర్శించడి


పాపికొండల్లో ఉన్న పేరంటపల్లి కి ఈ మధ్య టూరిస్టులు బాగ వస్తూన్నారు.మంచిది.పచ్చటి ప్రక్రుతి మధ్య సేదతీరడం మంచిదే.అటు ఇటు కొండలు,మధ్యలో అందమైన గోదారి,మళ్లీ ఆ గోదారిలో బోట్ మీద ప్రయాణం.ఆ హాయి అనుభవిస్తేనె తెలుస్తుంది. కాని వచ్చిన ప్రయాణికులలో కొందరు అక్కడ నానా చెత్త వెయ్యడం,తిని పారేసిన వ్యర్దాలన్ని అక్కడే విడిచి పెట్టడం ఆ ప్రదేశాన్ని అవమానించడమె అని గుర్తించాలి.
 పేరంటపల్లిలో ఇంచుమించు 70 సంవత్సరాల క్రితం స్వామి బాలనంద అనే మహాత్ములు అక్కడి అరణ్యంలో తపస్సు చేసుకునేవారు. ఆయనే అక్కడ ఉన్న ఆశ్రమాన్ని నిర్మించారు.ఆ ఆలయంలో యెటువంటి కానుకలు స్వీకరించరు.అలాగే అక్కడ యే విగ్రహం కూడా ఉండదు. యెవరికి నచ్చిన దైవాన్ని వారు ధ్యానించుకోవచ్చు.ఈ నియామాలు ఆ స్వామియే పెట్టారు. swamiji  ఆంగ్ల భాషలో గొప్ప పండితులు.spiritual enquiry అనే వారి ఆధ్యత్మిక గ్రంథం ఇప్పుడు తెలుగు లోకి కూడ అనువాదం జరిగింది.అది అక్కడ దొరుకుతుంది కొని చదవండి.

6 comments:

  1. మూర్తి గారూ ! మీ బ్లాగు కలర్ ఫుల్ గా బాగున్నది.

    ReplyDelete
  2. పేరంటాలపల్లి గురించి ఎంత చెప్పినా తకువే అనిపిస్తుంది నాకు. అక్కడి బొమ్మలు, జలపాతాలు, అన్నీ చాలా ఇష్టం నాకు. నానా చెత్త వెయ్యడం,తిని పారేసిన వ్యర్దాలన్ని అక్కడే విడిచి పెట్టడం అనేది ఈ మధ్య ప్రతీ చోటా కనిపిస్తున్నదే అండీ. ఈ మధ్యన తరచుగా చూసే ఇంకొక విషయం చిల్లర నాణాలు. ముఖ్యంగా బ్రిడ్జి మీద నుండీ ట్రైన్ వెళుతుంటే గోదావరిలోకి డబ్బులు విసురుతారు. పూర్వకాలంలో అంటే నాణాలు రాగితోనో, పంచాలోహాలతోనో చేసేవారు కనుక అలా వేయటం వలన నీరు పరిశుభ్రం అయ్యి మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు చిల్లర నాణాలన్నీ ఇనుముతోనో, ఉక్కుతోనో చేస్తున్నారు. ఇవి నీటిని శుభ్రపరచకపోగా కలుషితం చేస్తాయి. కనుక అవి వేయటం కూడా మానెయ్యటం మంచిది.

    ReplyDelete