Tuesday, July 3, 2012

ఇంగ్లీష్ మీడియంలో చదవడమే కాదు..దాంట్లో స్రుజనాత్మక శక్తిని ప్రోత్సహించాలి.


ఇంగ్లీషు భాష తెలుగు ని వెనక్కి నెడుతోందని, అది తెలుగు కి శత్రువు అని ప్రచారం చేసెవాళ్లని చూస్తే నవ్వాలో,యేడవాలో అర్ధం కాదు.నిజానికి అది  enrich చెసింది మన భాషని.ఒక గురజాడ,ఒక విశ్వనాధ, ఒక శ్రీ శ్రీ, ఇలాంటి మహా కవులెందరొ ఇంగ్లిష్ సాహిత్యాన్ని చక్కగ అధ్యయనం చేసారు. అంతేకాదు తెలుగులో దిగ్గజాలనదగ్గ మహానుభావులంతా ఆ భాషని చక్కగా నేర్చుకుని దాన్ని వినియోగించుకుని  తెలుగు పరిపుష్ఠం కావడానికి క్రుషి చేసారు.అంతే తప్ప పై పై మెరుగుల కోసం కేవలం మమ్మి,డాడి తొనే ఆగిపోలెదు. యెటు తిరిగి ఇంగ్లిష్ నేర్చు కోవటం చెత ఆని వాళ్లే ఇట్లాంటి కబుర్లు చెబుతుంటారు.మనవాళ్లని చాలమంది టి.వి. ల్లోను వాటిల్లోను చూస్తూంటే ప్రతివొక్కరు తెలుగు తమకి విదేశి భాషా అన్నట్లుగా మాట్లాడుతుంటారు.
ఇంగ్లిష్ చక్కగా వొచ్చినవాళ్లలోనె తెలుగు ని గౌరవించడం కనిపిస్తుంది. కావాలంటే పరిశీలనగా చూడండి.మనవాళ్లు  National level English  పత్రికల్లో తమిళుల్లా,బెంగాలి వాళ్లలా ఎందుకని రాణించరు..? మన దైన అనేక విషయాల్ని యెక్కుమంది దగ్గరకు తీసుకుపోవడానికి అది చాలా ఉపయోగ పడుతుంది. కేవలం పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం చదివించడం కాదు దాంట్లో స్రుజనాత్మకత కలిగేలా తీర్చి దిద్దాలి.    

No comments:

Post a Comment