Thursday, July 5, 2012

అల్లురి సీతారామరాజు చంపబడలేదని చెప్పడనికి నాకు లభించిన కొన్ని సాక్ష్యాలు


నిన్న అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజు.మరి ఎందుకనో కారణాలు తెలియదుగాని ఈ తెలుగు వీరునికి ఇవ్వవలసినంత గుర్తింపు ప్రభుత్వం వైపునుండి పెద్దగా ఉండదు.అది అలా ఉంచండి.

పాపికొండల్లోని ఫేరంట పల్లి స్వామిగా పిలువబడే బాలానంద స్వామి రామరాజు గారేనని నాకొక అనుమానం ఎప్పటినుండో...!ఆయన 1955 కాలంలో సమాధి చెందారు.

నేను ఇది యేదో Sensation కోసం చెప్పటం లేదు. అనేక కోణాల్లోనుండి పరిశీలించగా నాకలా అనిపించింది.దాదాపుగా 20 యేళ్ల క్రితం ఇప్పుడంతగా ఈ వూరు ప్రసిద్ది కాక మునుపు ఒక మిత్రునితో కలిసి అక్కడికి వెళ్లాను.

ఇది అల్లూరి తిరిగిన రంప Agency కి పెద్ద దూరం కాదు.నదీ మార్గం ద్వారా హాయిగా రావచ్చు. ఆయన 1897 లో జన్మించి 1924 లో చంప బడినట్లుగా మనకి తెలిసిందే.అయితే 1955 వరకూ జీవించిఉన్న పెద్ద ఆశ్చర్యం యేమి లేదు. అది మనిషి జీవించ దగిన వయసే..! జ్యొతిష్యం,మూలికావైద్యం,యోగసాధన వంటి గుప్త శాస్త్రాలు ఆయనకు తెలుసు.

అల్లూరిని చంపగా ముఖతా చూసిన వాళ్లు ఎవరూ లేరు. అలా ప్రచారం వల్లనే మనకి తెలుసు.బహుశా నాటి పాలకులు ఆయన్ని బందించిన తర్వాత కొన్ని షరతుల మీద, ఆయన మీద నిఘ వుంచుతూ విడిచి పెట్టివుండవచ్చు.

ఆ తర్వాత ఆయన ఆ కీకారణ్యం లాంటి పేరంటపల్లి లోనే యొగసాధనలోనే గడిపి ఉండవచ్చు.ఇప్పుడంటే tourist ప్రదేశమై జనాలు వస్తున్నారు.
అప్పుడది చాల భీకరమైన అటవీ ప్రాంతమే..!ఒకరకంగా ఇప్పటికీ అలాగే ఉంది.

Swamiji రాసిన Spiritual Enquiry , My message to human kind అనే ఇంగ్లీష్ పుస్తకాల్ని చదివాను. అవి పూర్తిగా ఆధ్యాత్మిక అంశాలతో ఉన్న రచనలే..! కాని మొదటి  పుస్తకం చాల గొప్ప గ్రంథం.. అటు ఇంగ్లిష్ భాష లోను,ఇటు  యోగసాధన లోను నిష్ణాతుడైన మహానుభావుడే అది రాయగలడు.

స్వామిజీ యెప్పుడు తన పేరుగానీ ,వివరాలు గానీ యెవరికీ చెప్పెవారు కాదని అక్కడి కొచ్చిన భక్త బ్రుందం లోని వారి రచనల్ని బట్టి తెలుస్తోంది.ఆయన రాసిన గ్రంథాల్లో సైతం యెంత తరచి చూసినా ఆ వివరాలు కనిపించవు.అయితే కొన్ని పేజీల్లో పరోక్షంగా క్షత్రియుడిని అనే అర్థం వచ్చేలా మాట్లాడటం కనిపిస్తుంది.

London కి చెందిన ఒక Enthusiast or Devotee(British national) స్వామీజి దగ్గరికి వచ్చి కొంత కాలం ఉన్నారు.అతని పేరు Adams.

తమ పరిసరాలని గాని ఇంట్లోగాని, అలాగే అక్కడి గుడిలోగాని చాలా శుబ్రతని అక్కడి కొండరెడ్లు Maintain చేస్తారు.ఇది స్వామిజి వల్లనే తమ పెద్దవాళ్లకు వచ్చినట్లుగా  వాళ్లు చెబుతారు.

స్వామిజి తన చివరి కాలంలో తీయించుకున్న ఫోటొలను చూస్తే అల్లూరి కి దగ్గరిగానే ఉన్నట్లు అనిపిస్తాయి.సహజంగానే ప్రాణాయామం వల్ల వచ్చె ముఖ సౌందర్యం ,కళ్లలో కనిపించె ఒక తేజస్సు కొంచెం అదనంగా చేరినట్లు కనిపిస్తాయి.
               

             

3 comments:

 1. మా నాన్నగారు కూడా మీరు చెప్పినట్టే సీతారామరాజు పోలీసు కాల్పుల్లో చనిపోలేదని చెప్పేవారు. బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు (మా నాన్నగారు) వారు రాసిన "మఱపురాని అనుభవాలు" అనే పుస్తకంలో దీని గురించి రాసారు. లింక్ కింద ఇస్తున్నాను. వీలు వున్నప్పుడు చూడండి.
  http://srilalitaa.blogspot.com/2011/06/blog-post_21.html

  ReplyDelete
 2. అల్లూరికి సంభందించి మంచి సమాచారం అందజేసారు. నేను సేకరించిన మరికొన్ని వివరాలు క్రింది లింకులో చూడొచ్చు
  http://antharlochana.blogspot.in/2014/06/blog-post_6534.html?utm_source=BP_recent

  ReplyDelete
 3. బ్యాక్ గ్రౌండ్ కలర్ వల్ల చదవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వైట్‌మీద బ్లాక్ లెటర్స్ అయితే చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది కేవలం సూచన మాత్రమే మూర్తిగారు.

  ReplyDelete