నిన్న నా పూనా అనుభవాల్లో భీం సేన్ జోషి గార్ని కలిసిన విషయం చెప్పాను గదా..! సరే.. ఇప్పుడు ఓషో అనబడే రజనీష్ గారి యొక్క ఆశ్రమానికి నేను వెళ్లినప్పుడు కలిగిన అనుభూతుల్ని వివరిస్తాను.ఆయన తన చివరి కాలంలో అమెరికా బహిష్కరించిన తరవాత ఈ పూనా లోనే స్థిరపడ్డారు. నేను ఆ ఆశ్రమాన్ని చూడడానికి వెళ్లిన సమయానికి ఓషొ సమాధి చెందారు.అప్పటికే ఆయన పుస్తకాలు కొన్ని చదివాను...నాకుతెలిసీ ఆధునిక భారత చరిత్రలో ఓషొ లాంటి యోగి ఇంకొకరు లేరు. ప్రపంచం లోని దాదాపుగా వందకి పైగా ధ్యాన పద్ధతుల్ని అంత గొప్పగా వ్యాఖ్యానించిన వారు ఇంకొకరు లేరు.అతని లాజిక్ కి యెవరైనా ముగ్ధులవ్వవలసిందే..!
స్వతహాగా జైనుడైనప్పటికి ప్రతీమత శాస్త్రం మీద, ఇంకా సైన్స్ మీద ఆయన పట్టు కి యెవరికైనా మతిపోవలసిందే..! బహుశ Western వారికి యోగం నేర్పడానికి ఆయన పుట్టారేమో. ..!తాను గత జన్మలో Belgium లో జన్మించానని ఓషో ఒకచోట చెబుతారు.నేను ఆశ్రమానికి చెరుకోగానే ,అక్కడ Gate దగ్గర ఒక శ్వేత జాతీయుడు గార్డ్ గా ఉన్నాడు. అతను మా వివరాలు అడిగి లోనికి పంపించాడు.లోపల ఒక కోనేరు,పెద్ద హాలు, కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. ఆ మధ్యలో ఓషో సమాధి ఉంది. ఆయన Teachings ని అమ్మే stalls కూడా ఉన్నాయి.ఆ స్టాల్ లో Whites ఉన్నారు. చెదురు మదురుగా అంతటా వాళ్లే యెక్కువగా అగపడుతున్నారు.వంగ పండు రంగు Uniforms వేసుకుని ఉన్నారు చాలామంది.
ఓషో అనగానే మనలో చాలామందికి Sex గురువు గానే తెలుసు.మన చాల పత్రికలు కూడా ఆ వొక్క విషయన్నే బాగా ఫోకస్ చేసాయి. నిజానికి అంతకి మించిన యెంతో ఙ్నాన సంపద అతని వద్ద ఉంది.ప్రస్తుతం చాలా మంది corporate gurus చెప్పే విషయాల్ని అతను యెప్పుడో చెప్పాడు.sex అనేది ప్రతి మనిషి యెప్పుడో ఒకప్పుడు తప్పక తెలుసుకుని తీరవలసిందే...కాని దాన్ని ఒక పాప కార్యం లాగా,చేయకూడని దాని లాగా యెందుకు మనుషులు భావించాలి...నీ తల్లి తండ్రి సెక్స్ లో ఉంటే నువ్వు ఆనందించాలి...వాళ్లు సంతోషంగా ఉన్నారని..! అలాగే ప్రతి ఒక్కరు ఇంకొకరి గురించి అలా భావించి నప్పుడు ఇన్ని రకాల మానసిక వ్యాధులు ప్రపంచంలో ఉండవు అంటాడాయన.
ప్రపంచంలో సెక్స్ గూర్చి యెక్కువగా ఆలోచిస్తూ,తక్కువగా చేసేవాళ్లు యెవరైనా ఉన్నారంటే అది భారతీయులే అంటాడు ఓషో..!.
"Each Death is Your Death.Because each death is a reminder that You are not going to be here Forever.Each Death is an Opportunity to be awake.Before Death comes use the opportunity of Life to attain something which is beyond death."
.....................Osho
This comment has been removed by a blog administrator.
ReplyDelete