Thursday, August 30, 2012

జర్మనీ దేశానికి చెందిన ఒక మిత్రుడు ఇటీవల రైన్ నది కి పక్కన ఉన్న వాళ్ల ఊరికి సంభందించిన ఒక పిక్చర్ పోస్ట్ కార్డ్ పంపాడు


జర్మనీ దేశానికి చెందిన ఒక మిత్రుడు ఇటీవల రైన్ నది కి పక్కన ఉన్న వాళ్ల ఊరికి సంభందించిన ఒక పిక్చర్ పోస్ట్  కార్డ్ పంపాడు.మన ఆంధ్ర ప్రదేష్ ని depict చేసే కొన్ని పోస్ట్ కార్డ్స్ పంపుదామని వాకబు చేస్తే ఈ మధ్య వాటి ప్రింటింగ్ ఆపివేసారని తెలిసింది.ఒకప్పుడు పర్యాటక శాఖ వాళ్ళు ఇలాంటివి ముద్రించేవారు.దాని వల్ల మన పర్యాటక ప్రదేశాల ప్రత్యేకతలు అవతల వాళ్ళకి తెలుస్తాయి.ప్రపంచంలో చాలా దేశాల వాళ్ళు ఈ picture post card లని సేకరించడం ఒక హాబీగా కూడా చేస్తుంటారు. ఇప్పటికీ ఇది ఆదరణీయమైన ఒక మంచి కాలక్షేపంగా అంతటా మన్నన పొందుతోంది.

అనేక యురోపిఎన్ దేశాల్లో నైతే ఇంచుమించు ప్రతి ఊరివాళ్ళు తమ ప్రదేశాల ప్రత్యేకతని వర్ణించే picture post cards ని ముద్రిస్తూ ఉంటారు.అలాంటివి నేను కొన్ని సేకరించాను.చాలా మటుకు పిల్లలకి బహూకరిస్తుంటాను.అవి వారిలో నూతన ప్రదేశాల గూర్చి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తాయి.చిన్నప్పుడు యేర్పడిన భావాలే బలమైన charactor గా రూపొందుతాయి.మన పర్యాటక శాఖ ఇలాంటి projects చేపట్టాలి.పర్యాటకత్వాన్ని encourage చేసే యే ప్రయత్నమూ ఒట్టిగా పోదు. అది మెల్లిగా మొక్కలా మొదలై క్రమేణా వ్రుక్షంలా పరిణామం చెందుతుంది.మౌలిక సదుపాయాలు కల్పించడం తో పాటూ ప్రజల్ని టూరిస్ట్ లకి friendly గా ఉండే విధానాన్ని నేర్పించాలి.మిగతా ప్రభుత్వ శాఖలకి పర్యాటక శాఖ భిన్నమైనది.కనుక వాటిలో ఉద్యోగాల్ని మొక్కుబడిగా చేసే వాళ్ళని కాకుండా Tourism పై ఆసక్తి అనురక్తి ఉన్నవారికి ఇవ్వాలి.మంచి రిసల్ట్స్ చూపించిన వారికి అదనపు  perks ఇవ్వాలి.

పర్యాటక రంగంలో విదేశీ మారక ద్రవ్యానికి సంబందించి మంచి potentiality వుంటుంది.దానివల్ల ఆదాయంతో బాటు మన సాంస్క్రుతిక పరివ్యాప్తి జరుగుతుంది. 

Spain,Greece,Belgium,Swiss,finland,norway,Sweden లాంటి అనేక దేశాలకి వారి పర్యాటక ప్రదేశాల గూర్చి తెలుపమని కొరినప్పుడల్లా యే ఒక్క సారీ వారు నా ఆశని వమ్ము చేయలేదు.తెలుసుకోవాలనే అసక్తితో నేను అడిగిన సాంస్క్రుతిక విశేషాల్ని కూడా చాలా swift గా పంపేవారు.ఆ విషయాల్లో వారి సహకారాన్ని అభినందించకుండా ఉండలేను.             

No comments:

Post a Comment