Tuesday, August 14, 2012

జులాయి సినిమా పై నా Review


జులాయి సినిమా పై నా Review: ఈ రోజు జులాయి  సినిమా కి వెళ్లాను.త్రివిక్రం శ్రీనివాస్ పంచ్ డైలాగ్ లు కొన్ని చోట్ల బాగా పండాయి.కొన్ని చోట్ల అవి యెక్కడో విన్నట్లుగాను అనిపించాయి.అల్లు అర్జున్ ప.గో.జి . యాస లో స్పీడ్ యెక్కువై అసలు డైలాగు యేమిటో కొన్ని సార్లు అర్థం కాలేదు.అదే జిల్లా కి చెందిన చిరంజీవి లాంటి వాళ్లు బాగానే డైలాగ్స్ పండించుతారు..అది వేరే సంగతి.

సినిమా మొత్తంలో ఖర్చు బాగా కనిపించింది. అదే భారితనమండి బాబు.బ్రహ్మానందం ఒక police officer ఇంటిలో అంత కలివిడిగా కుటుంబ సభ్యుడులాగా ఉండడం విచిత్రంగా ఉంటుంది. అదీ ఒక దొంగ అయ్యి ఉండి!అలాంటి బ్రహ్మిని విలన్ కి సాయం చేసే బ్రహ్మాజి దగ్గరకి జైల్లోకి పంపి అతన్ని ట్రాప్ చేయడం మరో వింత.already పోలిస్ ఆఫిసర్ ఇంట్లో బ్రహ్మి ని అంతకు ముందు బ్రహ్మాజి చూసి ఉంటాడు కూడ.

హీరో పాత్రని యెలివేట్ చేయడానికి already వచ్చిన కొన్ని తమిళ్ సినిమాల్లోని సంఘటలని దర్శకుడు వాడుకున్నాడు.అంత తెలివైన హీరో ని జులాయి అని యెందుకు అనుకోవాలో చచ్చినా అర్థం కాదు.ఇలియానా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అవకాశాలు కష్టమే..!పాపం చాలా దయనీయంగా ఉంది...యెలా ఉండే అమ్మాయి యెలా అయిపోయింది అనిపిస్తుంది యెవరికైనా..!

సంగీతం పరవాలేదు..రెండు పాటలు catchy గా ఉన్నాయి.fights లో విరగదీశాడు అర్జున్.!సినిమా average గా ఆడవచ్చునేమో..!పెద్ద hit అని మాత్రం చెప్పలేము.

  

1 comment: