Tuesday, September 11, 2012

ఈ మధ్య చాలా సినిమా పాటలు వింటున్నాను...కాని ఒక్క పాటా మెలోడిఎస్ గా ఉండటం లేదు అనను గాని చాలా వరకు వినడానికి చాలా కర్కశంగా అనిపిస్తున్నాయి

ఈ మధ్య చాలా సినిమా పాటలు వింటున్నాను...కాని ఒక్క పాటా మెలోడిఎస్ గా ఉండటం లేదు అనను గాని చాలా వరకు వినడానికి చాలా కర్కశంగా అనిపిస్తున్నాయి.పాట సాహిత్యం బాగుంటే పాడే గాయకుడి గొంతు కర్ణ కఠోరంగా ఉంటోంది.గాయకుడి గొంతు బాగుంటే ఆ బాణీ ఇతడికి సూటవ్వలేదేమో అనిపిస్తుంది.వెరసి సాహిత్య పరంగా,సంగీత పరంగా అరకొర దనం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.యెందుకో ఇది చిత్ర పరిశ్రమ హైదరాబాద్ వచ్చిన తరవతనే ఇలా తగలడింది అని చెప్పవచ్చు.ఇప్పటి మళయాళ పాటలు,తమిళ పాటలు మరీ మనంత dry గా ఉండటం లేదు.శేఖర్ కమ్ముల సినిమాల్లోని పాటలు ఇంకా కొన్ని డబ్బింగ్ పాటలే కాస్త ఎడారిలో ఒయాసిస్ లాగా తోస్తున్నాయి.Taste అనేదాన్ని యేమి నేర్పిస్తాం చెప్పండి ...యెవరికి వాళ్ళకే సంస్కారాన్ని బట్టి ఉండాలి తప్ప..! మన ప్రేక్షకులు చాల మంది దర్శక,నిర్మాతల కంటే చాలా మంచి అభిరుచి ఉన్నవారు నిస్సంశయంగా..!    

No comments:

Post a Comment