మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడమేమిటి..?FDI ప్రతిపాదనల్ని 72 గంటల్లోగా ఉపసమ్హ రించుకోక పోతే ప్రభుత్వానికి మద్దతు వెనక్కు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.మాటాడితే హెచ్చరికలు...సంకీర్ణ ప్రభుత్వాలతో వచ్చే చిక్కే ఇది.అభివృద్ది చెందిన ప్రజా స్వామ్యాల్లో ప్రజలు,పాలకులు దేశ ప్రయోజనాల పట్ల జాగరూకత కలిగి ఉంటారు.మన దగ్గర స్వంత పార్టీ ప్రయోజనాల కోసమో,సంకుచిత ప్రయోజనాల కోసమో ఒక మంచి విషయాన్ని కూడా కానివ్వకుండా అడ్డుపడతారు.పోనీ ఇంతా చేసీ పూర్తిగా ఆ ఇష్యు కోసం కడదాకా నిలుస్తారా అంటే అదేమీ ఉండదు...తెర వెనక బేరాలు కుదరడంతో...పట్టింపులన్ని హుష్ కాకి అయిపోతాయి.
No comments:
Post a Comment