Tuesday, September 18, 2012

బాహ్య ప్రదేశాల్లో మల విసర్జన అనేది మన దేశంలో ఒక శాపంగా పరిణమించిది.

బాహ్య ప్రదేశాల్లో మల విసర్జన అనేది మన దేశంలో ఒక శాపంగా పరిణమించిది.జనాలు కూడా దీన్ని పెద్ద తప్పుగా పరిగణించకపోవడం విచిత్రం.యెంతో శుబ్ర్హంగా శుచిగా ఉండవలసిన పుణ్య క్షేత్రాల్లో సైతం స్నానాలు చేసే ఘాట్ ల దగ్గర కూడా గలీజు చేస్తున్నారు.ఆ ప్రక్కనే ఒక రుపాయి ఇచ్చి టాయ్లెట్ కి వెళ్ళే సౌకర్యం ఉన్నా ..ఆ ఇంతోటి దానికి అది అవసరమా అనుకుంటూ బయటే కానిచ్చేస్తున్నారు.ఈ విషయాల్లో చట్టాలు మరింత కఠినంగా ఉండాలి.అనేక గ్రామాల్లో మంచి స్తోమత ఉన్న వారు కూడా టాయ్లెట్లు కట్టించుకోకుండా  బాహ్య ప్రదేశాల్లోనే మల విసర్జన చేయడం అత్యంత ఘోరమైన విషయం. ఒక దేశం యొక్క ఔన్నత్యం ఆ దేశంలో ఉన్న multi storied Buildings ని బట్టి ఉండదు.ఆ దేశ ప్రజల ఆరోగ్యకరమైన అలవాట్లపైన ఆధారపడి ఉంటుంది.       

1 comment:

  1. మన దేశంలో చేతుల్లో సెల్‌ఫోన్‌లు ఉన్నవాళ్ళు కూడా చెరువు దగ్గర మల విసర్జన చేస్తుంటారు. అభివృద్ధిలో మనం ఎక్కడ ఉన్నామో దీన్ని బట్టి అర్థమైపోతుంది.

    ReplyDelete