Wednesday, September 19, 2012

రాఘవేంద్ర రావు జన్మ తరించింది శిరిడి సాయి సినిమాతో.


రాఘవేంద్ర రావు జన్మ తరించింది శిరిడి సాయి సినిమాతో..!టికెట్స్ దొరక్క పోవడం వల్ల కొద్దిగా ఆలశ్యంగా చూశాను.మొత్తంగా చెప్పాలంటే సాయి తత్వాన్ని చక్కగా అర్ధం చేసుకుని సినిమా తీశారనే చెప్పాలి.ప్రేక్షకుల్లో అన్ని వర్గాల వారికి చేరడానికి కొంత కల్పన ని ఆశ్ర ఇంచిన మాట వాస్తవం.అయితే దాని వల్ల మూల స్వరూపం యేమాత్రం దెబ్బతినలేదు. నిజానికి ఇటువంటి చిత్రాలు తీయడం కత్తి మీద సాము లాంటిది.అనేక రకాలుగా ఆహార్యం పరంగా,సంవిధాన పరంగా,చరిత్ర పరంగా యెంతో జాగర్తగా తీయాలి.మళ్ళీ పెట్టుబడి పెట్టిన వారికి నష్టం రాకూడదు.కాబట్టి ఆవిధంగా మనం పాస్ మార్కులు వేసి తీరాలిసిందే..!
నాగార్జున పాత్ర స్వభావాన్ని అనుసరించి చక్కగా చేశాడు.విజయ చందర్ చేసిన తర్వాత యేముంటుంది చేయడానికి అనుకుంటూ వెళ్ళిన వాళ్ళకి నాగ్ తనదైన శైలి లో సమాధానం చెప్పాడు.అయితే పాటల విషయం లో నాటి ఇళయరాజా బాణీల కన్నా మిన్న అనుకునేలా కీరవాణి చేయలేక పోయాడేమో ననిపించింది.సినిమా సక్సెస్ అయ్యింది...సందేహం లేదు.       

No comments:

Post a Comment