ఈ మధ్య సినిమా తారల ఇంటర్ వ్యూలు చదువుతున్నారా....? చాలా మంది వింత సమాధానాలని తెలివిగా చెబుతున్నట్లుగా అనిపించడం లేదూ..? మీకు ఇష్టమైన డ్రింక్ యేమిటంటే ....నేను ఎంతో ప్రీతి పాత్రంగా తీసుకునేదీ...తడవ తడవ కి తీసుకునేదీ...తాగలేకుండా ఉండలేనిదీ యేమిటంటే......మంచి నీళ్లు...అంటున్నారు.ఇదేదో యే ఒక్కరో ఇద్దరో అంటే బాగుంటుంది...వరసబెట్టి డ్రింక్ ప్రస్థావన వచ్చినప్పుడల్లా చాలామందిది ఇదే సమాధానం...!!!
యెవరికి ఇష్టం లేకున్నా ఉన్నా మంచినీళ్లు చచ్చినట్టు తాగి తీరాలిసిందే...లేకపోతే చచ్చి ఊరుకుంటాం.అది మనకి ఆహారం కంటే కూడా చాలా అవసరం.సస్పెన్స్ లో పెట్టీ పెట్టీ మంచినీళ్లని తాగటాన్ని గూర్చి యేదో విస్కి యో ఇంకోదే తాగినట్టు చెబుతుంటే యేమి ఇంటర్వ్యూలురా బాబూ..అనిపించడంలా...!
No comments:
Post a Comment