
ఇళయ రాజా ని యెందుకు ప్రతివారూ ఇష్టపడతారు...? ఒక్క తెలుగు లోని పాటలే కాదు..తమిళంలోని పాటలు కూడా వినాలి అతనంటే యేమిటో తెలియాలంటే..!సినిమా సంగీతానికి గొప్ప గౌరవం తెచ్చిన వ్యక్తి అతను..!యెన్ని ప్రయోగాలు అతను చేసినవీ..! తమిళ జానపద బాణీలని ,పాశ్చాత్య బాణీలని మేళవించి చెసిన ప్రయోగాలు యెన్నని...instrumentral గా చెప్పాలంటే దానికి అంతు లేదు.అది flute గాని guitar గాని యెటువంటి అపూర్వ యెత్తుగడలు...?శ్రోత గుండె లోని లోపల కిటికి యేదైనా వుంటే అక్కడి కి వెళ్ళి దాన్ని గిల కొట్టినవాడు ఒక్క ఇళయరాజా మాత్రమే..!!అందుకనే r.d.burman లాంటి వాడు ఇళయరాజా లాంటి మేధావికి fan గా మారాడు.క్రి.పూ -క్రి.శ. యెలాగో అలాగే ఇళయరాజా తర్వాత వచ్చిన ప్రతి వారిపైనా అతడి ప్రభావం ఉంది....దానికి యెన్ని ఉదాహరణలు చెప్పినా తక్కువే...!!!
No comments:
Post a Comment