ఇటీవల కాలంలో కొత్తగా ఏడింటిని ప్రపంచ వింతల్లో చేర్చారు.దాంట్లో ఈ ఫోటోలో కనిపిస్తున్న machu picchu అనే ప్రాచీన కట్టడం ఒకటి.ఇది దక్షిణ అమెరికా ఖండం లోని పెరూ దేశం లో ఉంది.Andes పర్వతాల్లో సముద్ర మట్టానికి 7,790 అడుగుల ఎత్తులో నిర్మించబడింది.దీనికి క్రిందన ఎదురుగా ఒక నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది.దాదాపుగా 600 యేళ్ళ క్రితం inka పాలకులు వీటిని నిర్మించారు.బహుషా అంతరిక్షాన్ని పరిశొధించడానికి గాని,అప్పటి రాజుల విహారానికి గాని ఇది నిర్మించి ఉండవచ్చునని అనుకొంటున్నారు.
spain దేశీయులు ఈ పెరు దేశం మీద దండయాత్ర చేసినప్పుడు అనేక ప్రాచీన నిర్మాణాల్ని ధ్వన్సం చేశారు.అయితే ఇది ఒక మూలగా కనిపించకుండ ఉండడం వల్ల వారి బారిన పడలేదు.1911 లో yale university కి చెందిన పరిశోధకునికి అనుకోకుండా తటస్తపడింది ఈ నిర్మాణం.యేటా పెద్ద యెత్తున సందర్షకులు వస్తుంటారు దీన్ని చూడటానికి..!
నిజమే చాల అందమైన ప్రాంతం అది దానిని గురించి తెలుసుకోవడం ఇంకా బాగుంది
ReplyDelete