Saturday, December 1, 2012

"వెన్నెల మలుపులు-చీకటి మెరుపులు"


పద్యం,కవిత,కధ,నాటకం ఇలా వివిధ ప్రక్రియల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న మాల్యశ్రీ తన కధల నుండి 12 కధల్ని "వెన్నెల మలుపులు-చీకటి మెరుపులు" అనే పేరుతో ఒక కధాసంకలనంగా వెలువరించారు.దీన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకూర్ మేనేజర్ శ్రీ క్రిష్ణార్జున రావు కి అంకితమిచ్చారు.ఇటీవల ఈ కధా సంకలనం యొక్క ఆవిష్కరణ ఖమ్మం జిల్లాలోని చర్ల మండల కేంద్రం లో కోలాహలంగా జరిగింది.అనేకమంది సాహితి మిత్రులు,అభిమానులు,సాహితీ వేత్తలు దీనిలో ఫాల్గొన్నారు.




తమ స్వగ్రామమైన చర్లలో సేవా దృక్ఫధంతో డా. డి.ఎన్.కుమార్ ("కేర్" డైరెక్టర్,హైదరాబాద్) నిర్మించిన రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం లోని దేవభక్తుని నందీశ్వరుడు ,పుష్పావతి ఆడిటోరియం లో ఈ కార్యక్రమం జరిగింది.ఈ పుస్తక ఆవిష్కర్తగా విచ్చేసిన డా.డి.ఎన్.కుమార్ మాట్లాడుతూ మాల్యశ్రీ వంటి నిబద్ధత కలిగిన రచయితలు చాలా అరుదుగా వుంటారని అన్నారు.ప్రతి కళా కారుడు తన తర్వాత తరాల వారికి కూడా ఎంతో కొంత స్ఫూర్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు.



మాల్యశ్రీ మాట్లాడుతూ తనను తొలినాళ్ళలో ప్రభావితం చేసిన రాం షా,ఆవంత్స సోమసుందర్,రాజగోపాలాచార్యులు వంటి వారిని స్మరించుకున్నారు. ఎంతో కళా వారసత్వం కలిగిన చర్ల లో జన్మించడం తనకు గర్వకారణమన్నారు.మాల్యశ్రీ కధల్ని శిరం శెట్టి కాంతా రావు సమీక్షించారు. డా.చింతలపూడి వెంకటేశ్వర్లు,చక్రవర్తి,సి.వి.కె.రావు,శ్రీ క్రిష్ణార్జున రావు,షాజాహాన్,టి.వి.చలం,అమ్మిన శ్రీనివాసరాజు,దొడ్డి తాతారావు,దుర్గాచారి,బీర శ్రీనివాస్,గోపాలక్రిష్ణ,మూర్తి, తదితరులు మాల్యశ్రీ సాహితీ వ్యక్తిత్వం పై మాట్లాడారు.మాల్యశ్రీ దంపతులను ఘనంగా సన్మానించారు.వారి కుమారులు రమేష్ బాబు,శరత్,సోదరులు చింతూరి వెంకట రావు తదితరులు ఫాల్గొన్నారు.  

No comments:

Post a Comment