అలహాబాద్ కుంభ మేళ గూర్చి వస్తున్న వివిధ వార్తా కధనాలని చూస్తున్నాను.ఇంగ్లీష్ బ్లాగర్లు ముఖ్యంగా ఉత్తరాది వాళ్ళు చాలా ఫోటోలతో ...కలిపి బాగా రాస్తున్నారు.మనవాళ్ళు కూడా కొందరివి చదివాను.విదేశియులు కూడా బాగానే విచ్చేశారు.వారికి ఇదొక వింత..ఆసక్తి..అంతే..!అంతకు మించి ఆధ్యాత్మికతను అలవరుచుకుంటారనుకుంటే అది అసాధారణమే అవుతుంది. ముఖ్యంగా నగ్న సాధువుల మీద వాళ్ళని ఫోటోలు తీయడం మీదే వారికి ఆసక్తి.
వాళ్ళ పత్రికల్లో wow అంటూ చూడటానికి బాగా అక్కరకి వస్తాయి.నాగా సాధువుల్లో కూడా సరుకున్న వారు low profile నే అనుసరిస్తారు.వచ్చే భక్తులకి అవి ఇవీ చెప్పి డబ్బుని,వాహనాలని కోరుతున్న సాధువులని గుర్చి చదువుతుంటే ఇది యే రకం ఆధ్యాత్మికత అనిపిస్తోంది. ఖచ్చితంగా అది అఘోర సన్స్కృతి కాదు.అఘోర లని ఇప్పటికే మన సినిమాల్లో వీధిలో బోర్డ్లు పెట్టుకుని చేతబడులు గట్రా చేసే వారుగా హీనపరిచారు.
No comments:
Post a Comment