ఉత్తమ జాతీయ స్థాయి సినిమా అవార్డ్ ని పొంది.ఇర్ఫాన్ కి ఉత్తమ నటుడి అవార్డ్ కూడా తెచ్చిపెట్టిన "పాన్ సింగ్ తోమర్" కి మాతృక ఒక సైనికుడి నిజ జీవితమే..! ఈ పాన్ సింగ్ స్వాతంత్ర్యం రాకముందు సైన్యం లో పనిచేశాడు.ఇంకో విషయం యేమిటంటే ఇతను మంచి athlete కూడా.steeple chasing లో రికార్డ్ సాధించాడు.దాదాపుగా 10 యేళ్ళు ఆ record ని యెవరూ చెరపలేకపోయారు.
అయితే రిటైర్ అయి తన స్వంత గ్రామమైన విదీశ (మధ్య ప్రదెష్) కి వచ్చిన తరవాత భూమి విషయంలో జరిగిన ఒక గొడవలో బాబూ సింగ్ అనే గ్రామ పెద్దని కాల్చి చంపుతాడు.ఆ తరవాత చంబల్ లోయలో పెద్ద dacoit గా మారతాడు.చివరికి మహెంద్ర సింగ్ చౌహాన్ అనే పోలిస్ అధికారి పన్నిన ఉచ్చు లో చిక్కి చంపబడతాడు. స్థూలంగా కధ ఇది.
మన దక్షిణ భారతానికి ఈ కధ odd గా అనిపిస్తుంది గాని ఉత్తరాది వాళ్ళకి మాత్రం ఈ రాజపుత్రుల కధ వీరోచితంగా అనిపిస్తుంది.ఇర్ఫాన్ కి ఈ హీరో పాత్ర వేసినందుగాను వుత్తమ నటుడి అవార్డ్ వచ్చింది.(మళ్ళి దీంట్లో పంచుకోవడాలు గట్ర వున్నాయి లెండి)
No comments:
Post a Comment