Tuesday, March 26, 2013

ఇదెక్కడి మాయ రోగం..!




ఎందుకోగాని మంచి సినీ కవులకి కూడా తెలుగు వాళ్ళు ఇవ్వవలసినంత గౌరవం గాని గుర్తింపు గాని ఇవ్వరు.బయటికి నీతి కబుర్లు చెప్పడమేతప్ప అసలు తెలుగు భాష అంటే ఒక ప్రేమ అనేది ఉంటేగదా..!నేను చాలా మ్యూజిక్ కి సంబందించిన వెబ్సైట్స్ చూస్తుంటాను.దాంట్లో పాట పాడిన గాయకుల పేర్లు,సంగీత దర్శకుని పేరు,దర్శకుని ఇంకా నిర్మాత పేరు ఇలా యేవేవో వుంటాయి తప్ప పాట రాసిన సదరు కవి పేరు తెలుసుకుందామని చూస్తే మచ్చుకి దాంట్లో వేయరు..మరి అదేం space సమస్యో అర్ధం కాదు..!

ఆ మధ్య ఇలానే ఓ ఆడియో function జరుగుతున్నపుడు...సంగీత దర్శకుడైన ఇళయ రాజా ని ఇంకా ప్రముఖ వ్యక్తుల్ని వేదిక మీదకి ఆహ్వానించారు సదరు సినీ జీవులు..!ఆ సిమాకి పాటలు రాసిన కవిని కూడా వేదిక పైకి పిలిస్తేనే తాను వస్తానని చెప్పడంతో తప్పనిసరై అంగీకరించక తప్పలేదు.అదీ భాష పట్ల వుండవలసిన అభిమానమంటే...!!!  

More news here

No comments:

Post a Comment