Tuesday, April 2, 2013

వళ్ళు మండి పోతుంది ఇలాంటివి చూసినపుడు..!


వళ్ళు మండి పోతుంది ఇలాంటివి చూసినపుడు..! మండదా మరి..!ఎవరినైనా లబ్ద ప్రతిష్టులైన కళాకారులని ఇంటర్వ్యూ చేసే టపుడు ఆ రంగం లో ఎంతోకొంత అభినివేశం ఉన్న యాంకర్ లని టి.వి. చానెల్ వారు ఎన్నుకుని పంపించాలి.యేదో ముఖా ముఖి చేశాం చూసి తగలడండి అన్నట్టు ఉండకూడదు.

ఉదాహరణకి ఆ మధ్య ఇళయ రాజా తో ఓ యాంకర్ ప్రశ్నలు  (చానెల్ పేరుందుకు లెండి) ముఖాముఖి లో ఎంత నేలబారుగా ఉన్నాయంటే అసలు ఈ యాంకరులు ఎందుకని కొద్దిగ కూడా హోం వర్క్ చేయరు...అలాగనక చేస్తే ఎన్నో అమూల్య విషయాలు రాబట్టవచ్చు.మామూలుగా పేపర్లలో తరచుగా వచ్చే వాటినే తిప్పి తిప్పి అడిగితే యేముంటుంది అక్కడ..!

వుదాహరణకి ఆర్ఖెస్ట్రా విషయం లోగాని,కోరస్ విధానం లోగాని,కంపోజిషన్ లోని పద్దతుల్లోగాని ఇళయరాజ విప్లవాత్మకమైన ముద్రల్ని వేశారు...దానికి సంబందించి కొన్ని వాటిని  ఉటంకించుతూ మఖాముఖి నిర్వహించితే బాగుంటుంది...అలాగే మిగతా రంగాల్లోని వారిని కూడా..!

మీ inspiration ఏమిటి..అప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి..లాంటి రొడ్డకొట్టుడు ప్రశ్నలనుంచి ఇంకా ఎదగాలి చానెళ్ళవారు...ప్రేక్షకులకి అంత సీను లేదనుకుంటే ఎలా...?  

  More News Here

1 comment:

  1. ఈ విషయలో దూరదర్సన్ చాలా మెరుగు. ఇంటర్వూ చేసే వారికి కూడా చాలా విషయం లో చాలా పరిణితి ఉంటుంది.

    ReplyDelete