Thursday, May 30, 2013

ఇంచుమించు ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన కొత్త జీవితాలు సినిమాలోని ఈ పాట ఇప్పటికీ ఓ తీపి అనుభవం లాగానే మిగిలి పోయింది



ఇంచుమించు ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన కొత్త జీవితాలు సినిమాలోని ఈ పాట ఇప్పటికీ ఓ తీపి అనుభవం లాగానే మిగిలి పోయింది..! పొంగి పొరలే అందాలెన్నో పొంగి పొరలే ...అంటూ సాగే ఈ పాట చిత్రీకరణ కూడా ఎంత బాగుంటుందో...!కోట్లాది రూపాయల విలువ చేసే సెట్స్ ఏమి లేవు.కాని ప్రకృతినే నమ్మి ...ఆరాధించే ఒక ఈస్థటిక్ సెన్స్ వున్న దర్శకుడు పాటని ఎంత రమ్యంగా తీయగలడో తెలుపడానికి ఈ సాంగ్ ఒక వుదాహరణ. ఆ గుడి గంటలు....అందంగా దూకే జలపాతాలు...పచ్చని పరిసరాలు...అచ్చ తెలుగు యవ్వని లా సుహాసిని...సాదా సీదా గా సగటు తెలుగు కుర్రవాడిలా హరి ప్రసాదు.. హాఇగొలిపే సి నా రె సాహిత్యం,ఆ పైన ఇళయరాజా సంగీతం...బాలు..జానకిల సరాగాలు...ఎన్నాళ్ళు దాటినా పాత బడని నిత్య నూతన గీతం ఈ పాట..కాదా..!మీరే చెప్పండి...!

No comments:

Post a Comment