పెళ్ళి కూతురు కలర్ బాగానే వుంది..ఆబ్బాయే కొంచెం నలుపు..కాకి ముక్కుకి దొండపండు లా వుంది.. ఇలాంటివి అనుకోవడం మనం ఎన్నిసార్లు విని వుంటాం..?మొదటి నుంచి రంగు ని బట్టి అందాన్ని కొలవడం ఒక వెర్రి లాగా తయారయింది.రంగు ని బట్టి అందాన్ని చెప్పాలని చూడటం ఒక అర్ధం లేని టేస్ట్.అలనాటి వాణిశ్రీ నుండి నేటి రోజా వరకు...ఇంకా రజనీ కాంత్ లాంటి స్టార్ల వరకు ఎంతో మంది నలుపు రంగులో వున్నా అందంగా ..ఆకర్షణీయంగా వున్నారుగనకనే రాణించుతున్నారు.
మీరు బాగా గమనించినట్లయితె నలుపు రంగులో నున్న వారి కళ్ళు చురుకుగా..కొట్టొచ్చినట్టు prominent గా వుంటాయి.మెలనిన్ అనేది రంగుని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుందనేది అందరకి తెలుసు.ఉన్న ప్రాంతం..వుష్ణోగ్రత లాంటివి కూడా కీలక భూమిక వహిస్తాయి. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకో ఏ మూలనో తెల్ల రంగు అంటే ఏదో fascination..! నలుపు అంటే చులకన భావం..! రంగుని బట్టి సామాజిక్క వర్గాన్ని నిర్ణయించడం ఎంతమాత్రమూ జరగని పని.పైనుంచి క్రింది దాకా ప్రతి కులం లోను తెల్లవాళ్ళూ వున్నారు.నల్లవాళ్ళూ వున్నారు.
అందాన్ని రంగుని బట్టి నిర్ణయించడం చాలా అవివేకం.కాస్త రంగు ఎక్కువ వున్నవాళ్ళు మన సమాజం లో కొంత ego ని కూడా కలిగి వుండటం శోచనీయం.మరి ఆ లెక్కన బ్రిటిష్ వాళ్ళు ఎంత ఫీలవ్వాలి..? మనవాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఆష్ట్రేలియా..న్యూజీలాండ్ లాంటి దేశాలనుంచి యూరప్ లోని వివిధ దేశాల దాకా విస్తరించారు.మరి అక్కడి లోకల్ ప్రజలు మనాళ్ళని చిన్న చూపు చూసి దాడులు గట్రా చేయడం దీని కిందికే వస్తుందా..?
ఇంకో దురభిప్రాయం ఏమిటంటే తెల్ల తోలు వున్నవాళ్ళు చాలా తెలివిగల వారని..!మీరు ఉత్తరాది లో వుండే చాలా మందిని పలకరించి చూడండి...చాలా మందికి I.Q. దక్షిణాది వాళ్ళకంటే తక్కువ.కాబట్టి మీ అంతట మీరే అపరాధ భావనికి లోను కావద్దు.ప్రతిభ,దూసుకు పోయే గుణం,చాక చక్యమే మనిషిని ముందుకు తీసుకువెళ్ళేవి.ఈ సారి ఎప్పుడన్నా కస్త రంగు ఎక్కువ వున్నవాళ్ళు ఆధిక్యతా భావం ప్రదర్శిస్తే సహించక తగు విధంగా జవాబు చెప్పవలసిన వున్నది.
మంచి వివరణ..నిజంగా తెల్లగా ఉన్నవాళ్లు ego కలిగిఉంటారు.
ReplyDelete