Sunday, June 2, 2013

నా భువనేశ్వర్ యాత్ర - 2 వ భాగం..!






నా మొదటి పోస్ట్ లో భుబనేశ్వర్ లో నున్న రాజా రాణి దేవాలయం యొక్క ఫోటొలు కొన్ని ఇచ్చాను.దీంట్లో ఇంకొన్ని ఆ ఆలయానికి సంబందించినవే మీకోసం ఇస్తున్నాను.కాలానికి ఎదురు నిలిచి ఇన్ని వందల సంవత్సరాల పాటు నిలిచిన ఈ కట్టడాలని చూస్తే మన భారతీయ శిల్పుల గొప్పదనానికి జోహార్లు అర్పించాలనిపిస్తుంది.ఇది 11 వ శతాబ్దం లో నిర్మించినది.దీనికి ఉపయోగించినది ఒక రకమైన ఎర్ర రాయిని!ఇంచుమించు ఒడిషాలోని చాలా పురాతన ఆలయాలు ఇలాంటి ఎర్ర రాతినే ఉపయోగించారు.గోపురాల విషయంలో మన  దక్షిణాది ఆలయాలకి భిన్నంగా వుంటుంది ఒడియా శిల్పుల శైలి.దేని అందం దానిదే..!

ఈ ఆలయం మీద నాలుగు వైపుల..గోడల మీద చాలా అద్భుతమైన శిల్పం వుంది.ఎంత సృజనాత్మకత అనిపిస్తుంది. ఇంచుమించు ఒక వెయ్యి యేళ్ళ క్రితం ఇటువంటి అద్భుత నిర్మాణాలని ఒక అనాగరిక జాతులకి సంబందించిన సమూహం నిర్మించగలదా..?అసంభవం..ఇలాంటి ఎన్నో ప్రాచీన కట్టడాలని చూసినప్పుడు అనిపిస్తుంది...ఈనాటికీ మనకి ఎంతో కొంత గౌరవం తెల్లవాళ్ళు ఇస్తున్నారంటే అది కేవలం కొన్ని వేల యేళ్ళ క్రితమే గల మన ఇలాంటి మేధస్సు ని చూసే తప్ప మనకి గల కంప్యూటర్ ఇంకా ఇతర ఆధునిక శాస్త్రాల పరిజ్ఞానం చూసి కాదు.ఎందుకంటే వాటిని సృష్టించిన బ్రహ్మలు వాళ్ళు.కేవలం మనం వాటికి వినియోగదారురలం మాత్రమే..!

No comments:

Post a Comment