సంగీత దర్శకుడు శ్రీనివాస్ అథితి గా విచ్చేసిన నిన్నటి ఎపిసోడ్ హోరెత్తించింది.షణ్ముగప్రియ ..వైజాగ్ అమ్మాయి ఇంగ్లీష్ టైప్ రాగాల్లో విరగదీసింది.బహుశా రెహ్మాన్ ముమ్మరంగా ఈ తరహా ఇంగ్లీష్ గొంతు విరుపులు..పరిచయం చేసినాక చాలా పాటల్లో ఇలాగే దీన్ని ఓ పిచ్చిలాగా అనుసరిస్తున్నారు.ఏదో అప్పుడప్పుడు బాగుంటుది గాని ప్రతి దానికి అవసరం వున్నా లేకపోయినా ఓ ఇంగ్లీష్ పాట లాగా తెలుగు పాటలకి వరసలు కట్టి పాడిస్తుంటే అది ఇంగ్లీష్ పాట కాకుండా తెలుగు పాట కాకుండా పోతుంది.మొహం మొత్తుతోంది.
మిగతా పిల్లలు కూడా మంచి గా పాడారు.కొంచెం ఊపు సాంగ్స్ కదా..!మంచి ఊపులోనే పాడారు.కటక్ కుర్రాడు కొద్దిగా స్టామినా మైంటైన్ చేయాలి గొంతులో..!ప్రతి ఒక్కరి గొంతులో ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది.అది తెలుసు కుంటే ఏ గొడవలు వుండవు..ఎవరి పాటలు వారికి వుంటాయి.
Click here For News
you are right
ReplyDelete