Wednesday, June 5, 2013

నా భువనేశ్వర్ యాత్ర-3 వ భాగం..!


వుదయగిరి గుహలు భువనేశ్వర్ outskirts లో వున్నాయి.వీటిని ఖారవేలుడు క్రీ.పూ.2 శతాబ్దంలో జైన మునుల కోసం తొలిపించినట్టుగా చరిత్రకారుల అభిప్రాయం.నేను ఈ గుహల దగ్గరకి అడుగుపెడుతుండగా కొండముచ్చులు బిల బిల మంటూ వచ్చాయి.అయితే అవి మనలని ఏమీ అనవు లెండి..మనం ఏమైనా పెడితే తిందామని ఆశగా ఎదురు చూస్తుంటాయి.దాదాపుగా 180 మీటర్ల ఎత్తులో ఈ గుహలు వున్నాయి.ఇవి తొలిచినప్పుడు మరి ఎంత కీకారణ్యంగా వుండేదో ఈ  ప్రాంతమంత..!

ఖారవేలుని తో జరిగిన యుద్ధం తరువాతనే అశోకుడు బౌద్ధ మతాన్ని అవలంబించినట్టుగా చెబుతారు.ఈ గుహల్లో ని గదుల్లో ఒక్క మనిషి హాయిగా వుండొచ్చు.ఉదయ గిరి మీద మొత్తం వీటికి సంబందించి  18 నిర్మాణాలు ఉన్నాయి.అసలు రాతిని గదుల్లాగా తొలచాలనే ఆలోచన రావడం చాలా అద్భుతమైన విషయం.వీటి నన్నిటినీ చూస్తుంటే ఆ కాలంలోకి ప్రయాణం చేసినట్టుగా అనిపించింది.

అన్నట్టు ఈ గుహల ఆవరణలో మంచి తోట పెంచుతున్నారు.మనం చూడ్డానికి 20 రూపాయలు టిక్కెట్ ...విదేశీయులకైతే 100 రూపాయలు..!  






No comments:

Post a Comment