Thursday, June 6, 2013

భువనేశ్వర్ లోని ముక్తేశ్వర ఆలయం



భుబనేశ్వర్ ని ఒకరకంగా "ఈశ్వర భూమి" గా చెప్పవచ్చును.ఇక్కడున్న అనేక ప్రాచీన ఆలయాలు శివుని కి అంకితమొనర్చినవేనని అంటే పొరబాటు కాదు.నాకు తెలిసీ ఒక రాష్ట్రం యొక్క రాజధాని లో ఇన్ని ఆలయాలు వుండటం ఈ భుబనేశ్వర్ కే చెల్లింది.చాలా మటుకు పురాతన మైనవే..!

 ఇక్కడి నుంచి పూరి కి వెళ్ళే దారిలో కేదారగౌరి  ఆలయం వుంటుంది.దీన్ని ముక్తేశ్వర ఆలయం అని కూడా అంటారు.క్రీ.శ.950 లో సోమవంశ రాజైన యయాతి దీన్ని నిర్మించాడు.Red sand stone ని వుపయోగించారు.ఈ ఆవరణలో చిన్న చిన్న గుళ్ళు కూడా వున్నాయి.గోడల పైన ..రకరకాల శిల్పాలు వున్నాయి.

కొన్ని శిల్పాల తలలు తెగిపోయి ఉన్నాయి.. !ప్రధాన ఆలయంలో శివ లింగం వున్నది.మరొక దానిలో సర్పం వంటి ప్రతిమలు వున్నాయి.టూరిస్టులు కొంత మంది తెలుగు వాళ్ళు కూడ ఇక్కడ కనిపించారు నేను వెళ్ళినప్పుడు..!

ఇలాంటి పురాతన ఆలయాలు మనకి అనేక విషయాలు చెబుతుంటాయి.అప్పటి విశ్వాసాలు...నిర్మాణ విధానాలు..నైపుణ్యాలు ఇలాంటివన్నమాట.అందుకనే ప్రాచీన ఆలయాలు సందర్శించడం నాకు బాగా మక్కువ.    







Click here

No comments:

Post a Comment