నిన్నటి భాగం లో దానికి సినీ గీత రచయిత భాస్కరభట్ల అథితి గా విచ్చేశాడు.అథితి గా విచ్చేసిన వారిలో గీత రచయితలు..ఇంకా వేరే రంగం వాళ్ళు వచ్చినపుడు వాళ్ళ niche కి సంబందించి కొంత చెప్పనిచ్చే అవకాశం ఇస్తే బాగుంటుంది.అంటే పాటల కి సంబందించే సుమా..!అన్నీ కూడా లాలి పాటలు పాడారు.అయితే ఒకటి రెండు లాలి పాటల్లా అనిపించలేదు.అయినా కొంపలేమి మునిగాయి..కానివ్వండి..నో ప్రోబ్లం..!
వటపత్ర శాయికి వరహాల లాలి అనే పాట పాడతారనుకున్నాను.చాలా మటుకు పాత గీతాలే ఆలపించారు.అన్నీ మంచి సాహిత్య..సంగీత విలువలను కలిగి వున్నవే..!
ఈ పాడుతా తీయగా కార్యక్రమం పిల్లలందరికి ఒక చక్కని nostalgic అనుభవంగా వుండిపోతుంది.పెద్ద ఎదిగిన తరవాత రివైండ్ చేసి చూసుకుంటే వాళ్ళ రూపాలు వాళ్ళకే గమ్మత్తుగా వుంటాయి.దాంట్లో కొంతమంది మంచి famous అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
No comments:
Post a Comment