భద్రాచలం లోని అశోక్ నగర్ కాలనీ లో గల మాల్యశ్రీ గారి ఇంటికి ఇటీవల నేను వెళ్ళినప్పుడు కొన్ని బస్తాల్లో ఆయన దగ్గరున్న పాతపుస్తకాలు సర్దుతూ కనిపించారు.చాలా అమూల్యమైన గ్రంధాలు వారి దగ్గర కొన్ని వందల కొద్ది వున్న విషయం నాకు తెలుసు.
వివరం అడిగినప్పుడు ...వాటిని తాడిపత్రిలోగల స్పూర్తి గ్రంధాలయానికి,అలాగే గోదావరి ఖని లోని స్నేహ సాహితి గ్రంధాలయానికి విరాళంగా పంపిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయాన్ని తప్పకుండా బ్లాగు మిత్రులందరకి తెలియజేయాలని ఇక్కడ ఫోటోలతో కూడిన ఈ పోస్టుని పెడుతున్నాను. అన్ని దానాలకన్నా పుస్తక దానం చాలా గొప్పది.ఎంతోమంది జిజ్ఞాసువుల జ్ఞానార్తిని అవి తీరుస్తాయి.
కొన్నిసార్లు ఏ షాపు లోనూ దొరకని పుస్తకాలు విరాళరూపంలో వచ్చే వాటిలో దొరుకుతాయి.కనుక పుస్తక విరాళం అనే అలవాటుని ఇంకా ప్రజల్లొకి తీసుకువెళ్ళవలసిన అవసరం వుంది.ఇకపోతే సాహితీప్రియులకు మాల్యశ్రీ ని ప్రత్యేకించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. కధ,కవిత,వ్యాసం,నాటకం,పద్యం ఇలా అన్ని ప్రక్రియల్లో ఆయనకి ప్రవేశం వున్నది.అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి. జనరంజని(పద్య సంపుటి),రత్నమంజూష(బాల గేయాలు),రామదాసు(పద్య కావ్యం),వెన్నెల మలుపులు-చీకటి వెలుగులు(కధలు) వారి గ్రంధ రూపం లో వచ్చిన రచనల్లో కొన్నిటిగా చెప్పవచ్చు.తెలుగు విశ్వవిద్యాలయం లో ఒక విధ్యార్ధి వీరి సాహిత్యం పై పరిశోధక వ్యాసం సమర్పించి M.Phil పొందడం జరిగింది.

బాగా చదివేవారే బాగా రాస్తారు మాల్యశ్రీ గారు గ్రంధాలయాలకు తమ పుస్తకాలు ఇవ్వబూనడం మముబోంట్లకు ఆవశ్య అనుసరణీయం!
ReplyDelete