Saturday, June 15, 2013

ఒకోసారి తమిళ్ డబ్బింగ్ సినిమాలో మంచి సాహిత్య విలువలున్న సాంగ్స్ వస్తుంటాయి



ఒకోసారి తమిళ్ డబ్బింగ్ సినిమాలో మంచి సాహిత్య విలువలున్న సాంగ్స్ వస్తుంటాయి.ఈ పాట చిత్రీకరణ కూడా ఒక కవితీకరణలా వుంటుంది.మూలంలో బహుశా సుబ్ర్హమణ్య భారతి కి సంబందించిన యేదో రచన భావాన్ని దృష్టిలోనుంచుకుని చిత్రీకరించివుండవచ్చు. పాటలో ఒకచోట " రేపు అన్నది దేవునికి...నేడు అన్నది మనుషులకి..బతుకే బతికేందుకూ.." అని వస్తుంది. ఎంత రమ్యమైన భావన.అసలు మూలంలో ఎంత బాగుండి వుంటుందో..! డబ్బింగ్ లో అనువాదం లో కొన్ని పరిమితులు వున్నా..మొత్తం గీతం యొక్క భావం చాలా హృద్యంగా వున్నది.రెహ్మాన్ సంగీతం హాయిగా అనిపిస్తుంది చెవులకి..ముఖ్యంగా మధ్యలో వచ్చే ఫ్లూట్ బిట్స్.. excellent..! కనీసం అప్పుడప్పుడైనా మనవాళ్ళు ఒక సాంగ్ ఏదైనా ఇలా చేస్తారేమో అని ఆశిస్తుంటాను.

No comments:

Post a Comment