Saturday, June 15, 2013

ఇక్కడ బుద్దుని అస్థికల పైన ఒక బ్రహ్మాండమైన పగోడ నిర్మించారు

మనం ఫాఠాల్లో ఎప్పుడో చదువుకున్నాం కళింగ యుద్ధం గురించి..! కాని అదే ప్రదేశానికి వెళ్ళినప్పుడు కలిగే అనుభూతి చాలా అనిర్వచనీయంగా వుంటుంది.భువనేశ్వర్ కి రమారమి ఎనిమిది కిలో మీటర్లు వున్న ధౌలీ పరిసరాల్లోనే కళింగ యుద్ధం జరిగింది.ఆ తరవాత అశోకుడు బౌద్ధ మతం లోకి  మారి శాంతి ని ప్రచారం చేసినట్లుగా చరిత్ర..!



ఇక్కడ బుద్దుని అస్థికల పైన ఒక బ్రహ్మాండమైన పగోడ నిర్మించారు.దానికి చుట్టూతా ఆ మహాపురుషుని జీవితం లోని సంఘటనలని చిత్రించారు.బుద్దుని యొక్క శిల్పాలు చాలా బావున్నాయి.



ఈ పగోడ నిర్మించిన దానికి ప్రక్కనే దయా నది ప్రవహిస్తుంది.కళింగ యుద్ధ సమయంలో ఈ నది నెత్తుటి ప్రవాహంగా మారిందని చదివినది గుర్తుకొచ్చింది.

కొన్ని రావి చెట్లు కూడా ఈ నిర్మాణ ప్రాంగణంలో వున్నాయి.ఈ ప్రాంతం లో అశోకుడు వేయించిన అనేక శాసనాలు లభించాయి.



మాంచి ఎండలో వెళ్ళానా ఆపైన మెట్లు ఎక్కేటప్పుడు కొద్దిగా కాళ్ళు చుర్రుమన్నాయి.

ఈ పరిసరాలన్నీ ప్రశాంతంగా వున్నాయి.అన్నట్టు ఈ పగోడా నిర్మాణంలో జపాన్ కి చెందిన ఒక సంస్థ కూడా సహకరించింది.దానికి సంబందించి జపనీస్ భాషలో వున్న  ఒక దిమ్మ వున్నది.





No comments:

Post a Comment