Tuesday, June 18, 2013

నిన్నటి "పాడుతా తీయగా" గురించి నాలుగు ముక్కలు..!



మహబూబ్ నగర్ కుర్రాడు సుదీప్ పాడిన నెల్లూరి నెరజాణ అనే పాటతో కార్యక్రమం start అయ్యింది.చక్కని సాహిత్యం అమరిన పాట ఇది.డబ్బింగ్ లోనే భావ పరంగా ఇంత పరిమళభరితంగా వుందంటే ఒరిజినల్ లో ఎంత బాగుందో..! సహజంగా తమిళుల్లో emotional quotient చాలా ఎక్కువ.అది ఒక్క రోజుతో వచ్చింది కాదు.తిరువళ్ళువర్ లాంటి ఎందరో ప్రాచీన కవుల ప్రభావం.డబ్బున్న వాడికంటే ఒక మంచి కవికి ఇచ్చే గౌరవం ఎలాంటిదో తమిళులని చూసి నేర్చుకోవలసిందే..!మనకి కవి అంటే ఒక జోకర్...ఒక కార్టూన్లో బొమ్మ ..అంతే..!

దాంట్లో ఒకచోట-
"అరే కాలం మరిచి అడవి చెట్టు పూచినదే.." అని వస్తుంది.ఎంత అద్భుతమైన భావ చిత్రం.

సుదీప్ లో మంచి దమ్ము వున్నది గొంతులో ...!practice makes one perfect ..! కోపమా నాపైనా అనే పాట షన్ముఖప్రియ భావ భరితంగా పాడింది.ఈ అమ్మాయికి మంచి future వుంది.దేవుడ దేవుడా అనే పాట పరమేశ్వర రావు బాగా పాడాడు.దేవుడు మనిషికి ఒకటి  కొరత చేస్తే..దానికి ఫిల్ చేయడానికా అన్నట్లు ఇంకేదో ప్లస్ పాయింట్ ఇస్తాడు.ఎందుకంటే అన్ని నిండిన మనిషి కళ్ళు..కాళ్ళు భూమి మీద నిలబడవు.అది ప్రతి మనిషికీ వర్తిస్తుంది.
 మొజార్ట్(మనకి త్యాగయ్య ఎలానో అలా ..) లాంటి వారు కూడా పుట్టుకతో అంధులే  కదా..!

టిప్పులు టప్పులు అనేపాట బాగా పాడింది భమిడిపాటి వారమ్మాయి.టాలెంట్ బాగా వున్న వారికి అందం అనేది అదనపు ఆకర్షణ అవుతుంది.

విశ్వతేజ ఈసారి బయటికి వెళ్ళడం జరిగింది.ఏడుపు ఆపుకోలేక ఏడవడం కూడా జరిగింది.పెద్దాళ్ళకే ఏడుపోస్తుంది..మరిఒక్కోసారి తప్పదు..ఏమైనా..ఇంకా చాల భవిష్యత్తు వుంది గనక do not worry..!

ఆ చివరి అమ్మాయి నిన్నే నిన్నే కోరా అనేది పాడింది.అన్నట్టు ఈ అమ్మాయి కొద్దిగా పెద్దగా అనిపిస్తోంది ఏజ్ పరంగా.. లేదా మనిషి అలా కనిపిస్తోందో...! మళ్ళా కలుద్దాం మరి..
                                                                                                    Visit My Other Blog here

No comments:

Post a Comment