Tuesday, June 25, 2013

నిన్నటి "పాడుతా తీయగా" గూర్చి నాలుగు ముక్కలు..!



సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ ముఖ్య అతిథి గా వచ్చారు.మంచి మెలోడీ ల్ని పాడారు.ఒక సన్నని బాధ (meloncholy) ని పలికే గీతాలని ఈసారి ఎంచుకున్నారు.ఓ ప్రియా..ప్రియా అనే పాట గీతంజలి లోది మొదటిగా ఆ అమ్మాయి బాగానే పాడింది.వేటూరి శైలి అనితర సాధ్యం..పాండిత్యం వున్న ప్రతివారు గొప్ప భావుకులు కాలేరు..ఒకవేళ అయినా నిరంతరం ప్రయోగాలు చేయాలనుకోరు.ఒకవేళ అనుకున్నా అటు మాస్ ని ..ఇటు క్లాస్ ని పట్టుకోలేరు.విచిత్రంగా ఇవి అన్ని వేటూరిలో మూర్తీభవించాయి.లేకపోతే ఆ గీతం లోనే ఆయన  " జననాలు..మరణాలు మెరిసేది ప్రేమతో.." అనడం ఎంత అద్భుతం..ఒక పుస్తకమే రాయవచ్చు ఆ వాక్యం మీద..!

చిన్న ఉచ్చారణా దోషాలని సవరించుకోవాలి. మొత్తం మీద ఓ.కె..!దాంట్లో కోరస్ కూడా బాగుంటుంది. అసలు ఇళయరాజా పాటల్లో కోరస్ చాలా బాగుంటుంది.మధుర గీతం అని చెప్పి చాణ్ణాళ్ళ కిందట ఒక డబ్బింగ్ సినిమా వచ్చింది.దాంట్లో "నవ్వుల లోన పువ్వుల వాన" అనే పాటకి వచ్చే కోరస్ ఎంత బాగుంటుందో....ఇప్పటికి నేను ఆనందంగా వున్నప్పుడు ఆ కోరస్ని ఎవరో వెనక నుంచి పాడుతున్నట్టుగా అనిపిస్తుంది.వాళ్ళు ఇలాంటి  masters అంతా లేకపోతే మానవ జీవితాలు ఎంత వెలితిగ వుంటాయో..!

నిజమైనా..కల అయీనా ..అనే ఘంటసాల పాటని పరమేశ్వర రావు బాగా పాడాడు.ఎంత చక్కని సాహిత్యం..వరసలు..!
మనసా కవ్వించకే నన్నిలా....అనే పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట.అసలు meloncholy అనేదానికి నూరు శాతం అర్హమైన గీతం.దాంట్లో ని కవిత్వం గుండెని పిండుతుంది.ఎవరయ్యా సినిమాపాటల్లో కవిత్వం లేదనేది..?
సుశీల గారు ఆ పాటని ఎత్తుకునే స్థాయి ఎంత బాగుంటుందో..ఆమె స్వరం లోని ఆ క్లారిటీ నాకు తెలిసీ ఎవరిలోనూ లేదు.భగవంతుడు కొన్నిటిని అలా పెడతాడంతే..!ఐయితే ఒకటండోయ్ ..ఆమె మాట్లాడుతుంటే మాత్రం నేనెక్కువ సేపు వినలేను.

ఈ రెండిటిని సమపాళ్ళలో కలిగి వున్నది ఒక్క బాలసుబ్ర్హమణ్యమే నని చెప్పాలి.తలచినదే జరిగినదా అనే పాటని సుదీప్ చాలా చక్కగా పాడడు.ఇది కూడ చక్కని సాహిత్యం అమరిన పాట. షణ్ముఖప్రియ కూడా బాగా పాడింది.వెరసి అందరూ హాయిగా పాడుతున్నారు.జయాపజయాలు ఎలా వున్నా వీరందరికి మంచి భవిష్యత్తు వున్నదని చెప్పవచ్చు.

చివరిగా ఒక్క మాట..! "God Father" నవల్లో ..ఇటలీ నుంచి అమెరికాకి వచ్చిన Don clericuzio  యొక్క మితృడు అతని దగ్గర "qualified man" గా చేర్చుకోమంటాడు. క్వాలిఫైడ్ మేన్ అంటే సిసిలియన్ మాండలీకంలో ఇంకొక మనిషిని ఏ విధంగానైన చంపగలిగే వ్యక్తిని అలా పిలుస్తారు. అప్పుడు Don ఒక  అద్భుతమన మాట అంటాడు. " Each man has only one destiny"నువ్వు స్వతహాగా కళాకారుడివి..నువ్వు అలా వుంటేనే ఒకనాటికి పైకి రాగలవు.నీ మీది ప్రేమతో నిన్ను నా జట్టు లో చెర్చినట్లయితే యేదో ఒక రోజు నా మనిషి చేతిలోనే నువ్వు చనిపోతావు." అంటాడు.

నిజంగా Mario puzo ప్రతి నవలని మనిషన్న ప్రతివాడూ చదవాలి..! ఆర్.పి. పట్నాయక్ గారూ నమస్కారం..!

                       CLICK HERE    

No comments:

Post a Comment