Tuesday, July 2, 2013

నిన్నటి పాడుతా తీయగా పై నాలుగు ముక్కలు..!



ఈ సారి జానపదాల కి సంబందించిన పాటలు పిల్లలు పాడారు.అందరూ మంచి సాంగ్స్ ఎంపిక చేసుకున్నారు.నిరీక్షణ లోని చుక్కల్లే తోచావే అనే పాట తెలుగు భాష simplcity ని అదే సమయంలో లోతైన భావాన్ని వ్యక్తీకరించే శక్తిని విశదపరుస్తుంది.చాలా సులువైన పదాలని వుపయోగించి గుండెల్ని పిండే ఒక భావాన్ని పెల్లుబికించడం ఒక్క ఆత్రేయ కే చెల్లు.దానికి గాను  కవి కి విస్తారమైన  హృదయం లోపలికి చూడగలిగే ఒక చూపు వుండాలి. అనేక జీవితాల్ని ఒక్క జీవితంలో జీవించినవాడికే అది సాధ్యం

"వున్నా..వున్నాదొక దూరం ,ఎన్నాళ్ళకు చేరం.."  అనే మాట సినిమాలోని కధసారాంశాన్ని మొత్తం ఒకచోట పోసినట్టుగా వుంటుంది.మన సినిమాల్లో అప్పుడప్పుడు చాల మంచి సాహిత్యం వస్తుంది.కాని పేపర్లలో  సొల్లు రాజకీయ స్టేట్మెంట్లకిచ్చే space ని దానిగురించి చెప్పడానికివ్వరు.

పరమేశ్వర రావు బాగా ఆలపించాడు.షణ్ముఖ ప్రియ ,సుదీప్,అంతా మంచి సాంగ్స్ పాడారు.సాహితి ఎలిమినేట్ అయింది..మరి తప్పదు కొంత భాధతో కన్నీళ్ళు ..!  

                                                         Click Here For Interesting Topics                      

No comments:

Post a Comment