Tuesday, July 9, 2013

నిన్నటి 'పాడుతా తీయగా' పై నాలుగు ముక్కలు..!



కోటి ముఖ్య అథితి ఈసారి.అటు నవీన పోకడలు ..ఇటు మధురత రెండింటిని చక్కగా మిళితం చేసి బాణీలు కూర్చడం లో కోటి గారిది ఒక ప్రత్యేకమన శైలి. అసలు పిల్లల్లో వాళ్ళు మంచిగా పాడారు..వీళ్ళు పాడలేదు అని వంక పెట్టడానికి ఏమీ లేకుండా పాడుతున్నారు.సాలూరి రాజేశ్వర రావు గారు చేసీ ప్రతి పాటలోనూ ఓ సుతిమెత్తని పొహాళింపు వుంటుంది. అది వినడానికి చాలా హాయిగా వుంటుంది."రాధా కృష్ణ" అని చెప్పి శోభన్ బాబు నటించిన సిన్మా చాలానాళ్ళ క్రితం వచ్చింది.

దాంట్లో 'నీ మనసే బృందావనం...నీ పిలుపే మురళీ రవం' అంటూ టైటిల్ సాంగ్  వుంది.అది వింటున్నఫ్ఫుడల్లా గాలిలో తేలిపోతున్నట్టుగా వుంటుంది.మళ్ళీ అలాగే 'మ్రోగింది కళ్యాణ వీణా అని చెప్పి కురుక్షేత్రం  లోది..ఆ పాట కూడా ఈ రోజుకీ వస్తుంటే వినకుండా కదలబుద్ది కాదు. 

ఇక ఆయన  పాత పాటలంటారా...ఎన్నని చెప్పాలి..దానికోసం ఎన్ని టపాలు రాసినా సరిపోదు.ఈ సంధర్భంగా కొన్ని పాత సంగతులని స్మరించుకునే అవకాశం ఈ పాడుతా తీయగా  ఇచ్చింది.
                                      Click here For More Topics

  

No comments:

Post a Comment