సరే మంచికో...చెడుకో జరిగి పోయిందేదో జరిగి పోయింది.ఇక రెండు ప్రదేశాల వాళ్ళు ఎలా ఇంకా ముందుకి వెళ్ళాలో ప్రణాళికలు వేసుకొని సాగిపోయి జనజీవ స్రవంతిని సాధారణ స్థితి కి తీసుకురావడం తక్షణ కర్తవ్యం.రెండు రాష్ట్రాలకు వున్న ఎడం రెండు దేశాలకు ఉన్న ఎడం లాంటిది కాదు.ఎన్నో ఉత్తరాది రాష్ట్రాలకి చెందిన పరిశ్రమలు ఇప్పుడు హైద్రాబాద్ లో వున్నాయి.వాటికి ఏమౌతున్నది.అలాగే మిగతా అన్నీనూ..!జలాల విషయం లో కావచ్చు,ఇంకొక విషయం లో కావచ్చు కేంద్ర ట్రిబ్యునళ్ళు...సుప్రీం కోర్ట్ ఇలా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు కీలక పాత్ర వహిస్తాయి.కనుక చాలామంది చెబుతున్నంత భీత వహ పరిస్థితులు ఎప్పుడూ వుండవు.
సువిశాలమైన కోస్తా ప్రాంతాన్ని కలిగి వుండడం సీమాంధ్ర కి ఒక వరం లాంటిది.పరిశ్రమించే ప్రజలు పెట్టని కోట వంటిది.అంతగా అభివృద్దికి నోచుకోని ప్రాంతాలని కూడా ఇప్పుడు బాగా అభివృద్ది చేసుకోవచ్చు.సీమాంధ్ర అంత వైశాల్యం గాని,అన్ని రకాల పంటలు పండని నేలల్ని కలిగివున్న కేరళ ప్రజల జీవనప్రమాణ విషయంలో...తలసరి ఆదాయం విషయంలో చాలా రాష్ట్రాలకన్న మిన్నగా వున్నది.పైగా జనసాంద్రత కూడా చాలా అధికం.అలాంటప్పుడు కోస్తాంద్ర ప్రాంతం సర్వ నాశనం అవుతుందని అనుకోవడం ఒక భ్రమ.
నిజానికి ఇప్పటికంటే ఎక్కువ అభివృద్ది చెందుతుంది.
అసలైన అగ్ని పరీక్ష ఇప్పుడు తెలంగాణా నాయకులపైన నే వున్నది.చెప్పిన విధంగా ఉద్యోగాలకల్పన లేకపోతే యువత నుంచి వత్తిడి ఎదుర్కోవలసివస్తుంది.సాగు భూములకి నీళ్ళు,పారిశ్రామిక అభివృద్ది జరపకపోతే ఇతర వర్గాల నుంచి వత్తిడి వుంటుంది.పైకి ఎన్ని చెప్పినా ఆంధ్ర ప్రాంతీయుల పరిశ్రమలు తెలంగాణాలో కీలక భూమిక వహిస్తాయి.ప్రస్తుతం చత్తిస్ గఢ్ లాంటి కొత్త రాష్ట్రాలని తీసుకున్నా మధ్యప్రదేష్ కి చెందిన వారి సంస్థలు మామూలుగా నే నడుస్తున్నాయి.
కొత్తదనానికి అలవాటు పడటం వెంటనే కొంత బాధాకరంగా వున్నా ...వుండి ప్రతిదానికి కొట్టుకోవడం.. తిట్టుకోవడం కన్నా ఎవరి జీవన రహదారుల్లో వారు వృద్ది ని పొందడం ముఖ్యం.హిందీ తల్లి అయిదు రాస్ట్రాల్లో హాయిగా వున్నఫ్ఫుడు..తెలుగు తల్లి రెండు రాష్ట్రాల్లో మనుగడ సాగించలేదా..!!!
Click Here for More

లెస్స గా చెప్పారు మూర్తిగారు!గతజలసేతుబంధనాలు ఆపి ముందు కర్తవ్యం ఆలోచించాలి!ఆంధ్రసీమ,తెలంగాణా కన్నా అధిక అభివృద్ధి చెందుతుంది!ఒంగోలును రాజధానిగా చేసుకుంటే పుష్కలంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎన్నెన్నో సుందరహర్మ్యాలు అధునాతనంగా నిర్మించుకోవచ్చు!తెలంగాణా అమాయక ప్రజలను మీ శత్రువులుగా చూడకండి!తెలుగు తెలుగు భాయి భాయి!
ReplyDelete