Sunday, August 4, 2013

ఈ గీతం లోని భానుప్రియని చూసినతరవాత ఆమె కి గొప్ప fan గా మారాను.


Swarna Kamalam Songs - Koluvai Yunnade... by teluguone

స్వర్ణకమలం సినిమాలో అయితే వుందిగాని బయట ఆల్బం లో ఎందుకనో ఈ పాట నాకు ఎక్కడా కనబడలేదు. అసలు ఆ సినిమాలో అన్ని పాటలకంటే నాకు ఈ పాట చాలా ఇష్టం.భానుప్రియ నృత్యం,అందచందాలు ఈ పాటలో శిఖరప్రాయంగా తోస్తాయి. ప్రతి అంగం ఎంత లయబద్దంగా సంగీతం తో మిళితం చేసి కదిపిందో..!ఆ ముద్రలు కూడా ఎంతో పరిణితి చెందిన నృత్యకారిణికి గాని రావు అని నా అభిప్రాయం.బాలు స్వరం లో ఎంత తీయ దనం...ఆద్భుతమైన ఇళయరాజా కంపోజిషన్స్ లో ఇది ఒకటి.నేను అంతకుముందు పట్టించుకునేవాడిని కాదుగాని ఈ గీతం లోని భానుప్రియని చూసినతరవాత ఆమె కి గొప్ప fan గా మారాను.Click here for more

No comments:

Post a Comment