Thursday, August 29, 2013

బి.జె.పి.కి వివేకానంద స్వామి కి సంబంధం ఏమిటి చెప్మా..?



పోస్టర్ల మీద బిజెపి పార్టీ వారు వివేకానందుని బొమ్మ ఎందుకు వేసుకుంటారు..ఆయన వారికి own అయిన వ్యక్తిగా చాలామంది భావించడం కూడా చూశాను.బహుశా హిందూవుల పట్ల ..హిందూ మతం పట్ల ఆయనకి గల  ప్రేమాభిమానాలకి వారు ముగ్ధులయ్యి ఆ విధంగా చేస్తుండవచ్చు.

వివేకానందుని జీవితాన్ని ...సమగ్ర సాహిత్యాన్ని..డైరీలని..లేఖలని  పూర్తిగా అధ్యయనం చేసినట్లయితే ఆయన పరిధి చాలా విస్తృతమైనదని అర్ధమౌతుంది.హిందూ మతం లోని ఎన్నదగిన గుణాలని ఆయన ఎంత ప్రస్తుతించారో .. దానిలోని అవలక్షణాలని అంత దునుమాడారు కూడా..! ఇస్లాం మతంలోనున్న సమానత్వం  మరేమతంలోనూ లేదని ఓ శతాబ్దం క్రితమే చెప్పిన విప్లవకారుడు కూడా..!టర్కీ మహారాజు ఒక యోగ్యుడైన వ్యక్తి ముస్లిం అయ్యివుంటే చాలు అతడు నీగ్రో అయినా సరే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు..అలాంటి సమానత్వభావన ఏ మతం లోనూ కానరాదు అంటాడాయన!

అలాగే పాశ్చ్యాత్యుల లోని గొప్పలక్షణాలని వివేకానందుని లా శ్లాఘించినవారులేరు.అదేవిధంగా వారిలోని చెడుని దుయ్యబట్టినవారూ లేరు.ఆయన చెప్పిన కొన్నింటిని మరుగు పరిచే విధంగా చాలా మంది ప్రయత్నిస్తుంటారు.ఎందుకంటే అవి అంగీకరించాలన్నా చాలా ధైర్యం కావాలి.అన్నింటికన్నా ముఖ్యంగా అమెరికాలో చికాగో ప్రసంగం తరవాత అనేక ప్రదేశాల్లో అక్కడ చాలా ప్రతికూల పరిస్తితులని సైతం ఎదుర్కొని ఆయన తన భావజాలాన్ని ప్రసరించారు.కొన్ని సమయాల్లో ఆయనపై  దాడి చేయడానికి ప్రయత్నించిన సంధర్బాలు కూడా లేకపోలేదు.

అలాంటి సమయం లో ఒక మితృడు ఎందుకైనా మంచిది కొద్దిగా జాగరూకతతో ఉండమని చెప్పగా ఇలా అన్నారు."యోగి పుంగవుడైన ఆ మేరీతనయుని దేశంలోకదా నేనున్నది నాకు ఏమీకాదు."  click here


  

7 comments:

  1. స్వామీ వివేకానందా వారు మతానికి అతీతం గా వెలిగిన వారు ! బీజేపీ కూడా వారి అడుగు జాడల్లో వెళ్లాలని కొత్త రూపం దాలుస్తుందేమో మరి !?

    జిలేబి

    ReplyDelete
  2. Very nice article. Vivekananda is "Andari Vadu"

    ReplyDelete
  3. Very nice Article.Swamy Viekananda was very broadminded man. He respected all religions at the same time he brought recognitions to the rich cultures in the world.

    ReplyDelete
  4. That's true .... Thanks for being here!

    ReplyDelete