మనం బస్ స్టాండ్ లోనో, ఇంకా జనసమ్మర్దం బాగా ఉన్నచోటనో వున్నప్పుడు కొంత మంది తారసపడుతుంటారు.చాలా దీన వదనాలతో తమ bag ఎవరో కొట్టేశారనో..లేదా తమ వద్ద వున్న డబ్బుల్ని ఎవరో దొంగిలించారనో చెప్పి మనల్ని సహాయం అడుగుతుంటారు.మీరు ఎంతో కొంత సాయం చేయక పోతే కష్టాల పాలు అవుతామని నమ్మించుతారు.దీంట్లో ఒక్కోసారి ఆడవాళ్ళు కూడా కనిపిస్తుంటారు.ఏ మూలనో ఉన్న మానవత్వం తో ఒకటి రెండు సార్లు సాయం చేస్తాము.విచిత్రంగా వాళ్ళే మనకు సేం డైలాగ్స్ చెబుతూ చాలా చోట్ల కనిపిస్తుంటారు.అంటే డబ్బులు సంపాదించడానికి అది వాళ్ళు ఎన్నుకున్న మార్గం అన్న మాట.చాలా మోసపోయిన అనుభూతి మనకి కలుగుతుంది అప్పుడు. ఒక్కోసారి నిజంగా victims కి కూడా మనం దానం చేయాలంటే సందేహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మన సెంటిమెంట్స్ మీద దెబ్బకొట్టి డబ్బుచేసుకునే వాళ్ళని చూస్తే వీళ్ళు ఏం మనుషులురా బాబు అనిపిస్తుంది.
కొంతమండి ఆడవాళ్ళు చంటి పిల్లలని చంకలో వేసుకుని వస్తుంటారు అడుక్కోడానికి.అంటే పిల్లల కోసమైన ఇవ్వకపోతారా అని వాళ్ళ వుద్దేశ్యం అన్నమాట.ఎంత నీచమైన ఆలోచన.ఆ పిల్లల్ని కూడా వెధించిన వారు అవుతున్నారు వాళ్ళు.ఇలాంటి వాళ్ళకి ఎట్టి పరిస్తితుల్లో దానం చేయకుండా వుండటమే తగిన మందు లా పనిచేస్తుంది. Click here for more
మీరు చెప్పింది కరెక్ట్! నేనూ ఓ సారి మోసపోయాను. కడుపులో గుడ్డలు కూరుకుని ప్రెగ్నెంట్ లాగ అడుక్కుంటుంటే జాలిపడి వంద రూపాయిలు ఇచ్చిన ఐదు నిమిషాల్లోనే వేషం మార్చింది...
ReplyDelete