Saturday, September 21, 2013

వెల్ కం ఒబామా సినిమా పై నా రివ్యూ..!



సినిమా పేరు గమ్మత్తు గా పెట్టారు గదా..ఎలా justify చేశారో చూద్దామని వెళ్ళాను.సర్రోగసీ Pregnency ఇతివృత్తం..దానికి సెంటిమెంటు..కొంత సునిశిత హాస్యం అద్ది తీశారు.సినిమా లోని లొకేషన్లు బాగున్నాయి.మరీ బోరు కొట్టకుండా కధనాన్ని స్లో మోషన్ లో లాక్కెళ్ళారు.సింగీతం శ్రీనివాసరావు ఏదో ఒక నవ్యత..చూపిస్తాడు అనేదాన్ని మళ్ళీ ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.ఒకరకంగా చెప్పాలంటే ఆటవిడుపు లా వుంది..ఒకేలాంటి మూస సినిమాలు చూసి..!

లూసీ పాత్ర వేసిన అమ్మాయి బాగా చేసింది.తల్లిగా చేసిన ఊర్మిళ కూడా చక్కగా చేసింది.ఆ పిల్లవాడు కూడా ఓ.కె.!గీత రచయితలు భువన చంద్ర,శ్రీరాం..కొత్త నటుల్లా అనిపించలేదు..వీళ్ళు అప్పుడప్పుడు కొన్ని పాత్రల్ని ఇహ వేసుకోవచ్చు.పాటలు బాగున్నాయి.నీటుగా..హాయిగా వుంది..ఓసారి చూడవచ్చు..ఇదో వెరైటీగా అనిపిస్తుంది.కధని  చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది.కొన్ని సన్నివేశాల్లో కళ్ళు తడవక మానవు ..!Click here 

No comments:

Post a Comment