Wednesday, June 4, 2014

దాసరి అమరేంద్ర గారి "సాహితీ యాత్ర" (వ్యాసాలు భాగం) పై నా అభిప్రాయం



అమరేంద్ర గారి సాహితీ యాత్ర పుస్తకం లోని రెండవ భాగమైన ఇంటర్వ్యూలమీద గతం లో నా ఇంగ్లీష్ బ్లాగులో ఓ చిన్న రివ్యూ ని పోస్ట్  చేశాను.రివ్యూ అనడంకంటే నా అభిప్రాయాన్ని ఏవోనాకు తోచిన కొన్ని మాటల్లో వ్యక్తపరిచాను అంటే బాగుంటుంది.

మరి ఈ మొదటి భాగమైన సాహితీ వ్యాసాలు మీద ఎందుకు రాయలేదు అని సందేహం రావచ్చు.నిజం చెప్పాలంటే మనసు రాకనే.కధ గాని,నవల గాని నేను తెలుగు భాష లో చదివింది చాలా తక్కువేనని చెప్పాలి. అయితే బొత్తిగా చదవకుండానూ లేను.ఇష్టం వచ్చినట్టుగా రాసి పారేయడం కూడా పద్ధతి గాదు.అందుకే ఆగాను.

ఈ భాగం చదవడం వల్ల నాకు కలిగిన మేలు ఏమిటంటే ఏ కధల్ని చదివితే బాగుంటుంది అనేది.అలాగే ఇతర ప్రక్రియ అయిన నవల విషయం లోనూ.నాకు మొదటి నుంచి యాత్రా సాహిత్యం ,ఆటోబయోగ్రఫీలు వంటివి చదవటం  ఇష్టం.రమారమి రెండు దశాబ్దాల క్రితం అమరేంద్ర గారి మూడు నగరాలు అనే పుస్తకాన్ని చదివాను.అది యాత్రా సాహిత్యం.నాపై గాఢ ప్రభావం చూపిన పుస్తకాల్లో అది ఒకటి.అప్పటికే 'సంజీవ్ దేవ్ గారి తెగిన జ్ఞాపకాలు 'చదివి ఉన్నాను.ఆయనతో జరిపిన ఉత్తర ప్రత్త్యుత్తరాలు,వారి ఇంటికి ఓ సారి వెళ్ళడం ఇవన్నీ ఒకప్పటి తీపి అనుభూతులు.

సరే...కేశవరెడ్డి గారి రచన అతడు అడవిని జయించాడు,అల్లం శేషగిరిరావు గారి పులి చెరువులో పిట్టల వేట ఇలాంటి కొన్నింట్లను మాత్రం అదృష్టవశాత్తు చదవగలిగాను.వాళ్ళిద్దరి శైలి దృశ్యం కళ్ళకి గట్టినట్లుగా ఉంటుంది.వివిధ రచయితల ఎన్నదగిన,వృద్ది చేసుకోదగిన అంశాలను అమరేంద్ర చక్కగా చెప్పారు.

ఎ సూటబుల్ బాయ్ పై కూడా చెప్పదగిన విషయాలను తెలియజేశారు. అది చదవాలనే కుతూహలం కలుగుతుంది పాఠకునికి.మంచి కధా లేదా నవలా రచయితలకి రావలసిన పాపులారిటీ కూడా తెలుగు లో రాదేమోనని ఘంటికోట వారిని ఉదాహరణగా చెప్పారు.  తెలుగు ఫిక్షన్ కంటే ఇంగ్లీష్ ఫిక్షన్ ఎక్కువ చదవడం మూలానేమో పోలిక తెచ్చుకోవడం అనేది నాకు అచేతనంగా జరిగిపోతుంది.ఆ కోణం లోనుంచి చూస్తే అందరూ అనికాదుకాని,చాలామటుకు మన వాళ్ళు అతి ఆదర్శాన్ని,ఆచరణకి సాధ్యం కాని వాటిని పఠితలకి ప్రతిపాదిస్తుంటారు.ఒక అంశాన్ని చూడటం లో గాని..విశ్లేషించడం లో గాని..!

నాకు తెలిసిన రచయిత మిత్రులను అడుగుతుంటాను....ఎందుకని మీరు ఇంగ్లీష్ భాషలో నే డైరెక్ట్ గా చదవరు...ఏ విదేశీ రచనలని అయినా అని..! ఇంగ్లీష్ కాని ఏ యూరపు భాష అయినా ,ఆఫ్రికన్ భాష అయినా ...ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పటికే కొంత రసం పోతుంది.అది మళ్ళీ తెలుగు లోకి వచ్చేప్పటికే ఇంకొంత రసం పోతుంది. దాని వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగితే ఒకటే చెబుతా...ఆ అనుభవాన్ని పొంది చూస్తేనే తెలుస్తుంది అని.Click here
                  --------KVVS Murthy

No comments:

Post a Comment