Sunday, July 13, 2014

దృశ్యం సినిమా పై నా రివ్యూ

దృశ్యం సినిమా పై నా రివ్యూ

ఈ రోజే చూశాను.ఒక మాదిరి మంచి హోంలీ సినిమాలు లేక మొహం వాచిపోయిఉన్న తెలుగు ఆడియన్స్ కి చిరుజల్లు లా అనిపిస్తుంది.సందేహం లేదు.అయితే రెండవ భాగం లో పోలీస్ స్టేషన్ లో ని చిత్రహింస ల సన్నివేశాలు కొద్దిగా భరించాలి.స్క్రీన్ ప్లే బిగుతుగా ఉండటం,ఆ తరువాత మంచి హిలేరియస్  డైలాగులు,చక్కని లొకేషన్లు ,కధ లోని సస్పెన్స్ ఇవన్నీ దృశ్యం సినిమా కి హైలైట్స్.

ఆల్రెడి మళయాళం లో ప్రూవ్ అయిన సినిమా కాబట్టి తెలుగు లో హాయిగా దింపేశారు.మరి ఏం చేస్తాం...మన దగ్గర సరుకు లేనప్పుడు ఎక్కడో తెచ్చుకోవాలిగా..!మోతాదు మించిన మాస్ అట్రక్టివ్  డ్రెస్ లు,అవసరం లేకపోఇనా కేవలం రిచ్నెస్ కోసం విదేశాల లొకేషన్ ల లో మునిగితేలుతూ .. చిల్లర గా సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్ని నిందిస్తారు గాని దీనిలో అలాంటివి ఏం ఉన్నాయని బాగా అనిపించింది సినిమా..?

మరదే బుర్ర పెట్టి ..ఆలోచించి వెదకాలేగాని మన మధ్యే ఇలాంటివి ఉంటాయి.ఏడాదికి ఓ పదో ..ఇరవై వో ఇలాంటి సినిమాలు వస్తే చాలదూ...ఎందుకూ పనికిరాని సినిమాలు వందలకొద్దీ తీయడం..మళ్ళీ ఏడవడం అంత ఖర్చు అయింది..ఇంత ఖర్చు అయింది అని..!

సినిమా కి దృశ్యం అనే పేరు పెట్టడం లోనే ఒక ఈస్థటిక్ సెన్స్ ఉంది.ఆ క్రెడిట్ ఆ ఒరిజినల్ సినిమా క్రియేటర్స్ కే  చెందుతుంది.మళయాళం లో ఆ కధా రచయిత జీతూ జోసెఫ్ నే దర్శకత్వం కూడా వహించాడు.దాంట్లో  మోహన్ లాల్ పేరు జార్జ్ కుట్టి ..ఇక్కడ మన వాతావరణానికి తగ్గట్లుగా పేర్లు మార్చారు అంతే.వెంకటేష్ ఇల్లు..పరిసరాలు..కొన్ని వీధులు అంతా కూడా కేరళ లోని లొకేషన్లే.పచ్చగా బాగానే ఉన్నాయి.విజయనగరం పేరుని..అవసరాన్ని బట్టి వాడుకున్నారు.కొన్ని తెలుగు వీధులు కూడా అక్కడక్కడ.

హీరో కేబుల్ వ్యాపారి గా ఉండటం..మిడిల్ క్లాస్ లైఫ్ ..కుటుంబం తో పెనవేసుకున్న సెంటిమెంట్ ...లేవిష్నెస్ పేరు తో నేల విడిచి సాము చేయక పోవడం ఇదే సినిమా ని బాగా జనాలకి కనెక్ట్ చేసిన అంశం.వెంకటేష్ గాని మీనా గాని చక్కగా నటించారు.ఆ పిల్లలు కూడా బాగా చేశారు.ఆ చిన్నమ్మాయి మాతృక లోని సినిమాలో కూడా నటించింది.సంగీతం కూడా బావుంది.పాటలు లేకపోయినా  నడుస్తుందిలే గాని...రెండు పెట్టారు.

నిజం చెప్పాలంటే ఈ సినిమా కి ప్రేరణ Suspect x అనే ఇంగ్లీష్ సినిమా.ఎంతైనా మళయాళీ లెట్టాన్ లు గదా..సొంత వాతావరణానికి తగ్గట్లు మలిచారు.ఏమైతేనేం..మనల్ని అలరించారు..అంతదాకా మనం అభినందించవలసిందే. Click here

No comments:

Post a Comment