Sunday, August 3, 2014

ఆడవాళ్ళని చూడటం లో మనకి పాశ్చాత్యులకి ఉన్న తేడా ఏమిటంటే..!

 ఆడవాళ్ళని చూడటం లో మనకి పాశ్చాత్యులకి ఉన్న తేడా ఏమిటంటే..!

అసలు మౌలికంగానే కొన్ని తేడాలున్నాయి అనిపించేది ఇలాంటి విషయాల్లో.అందాన్ని చూపించడం..లేదా బలాన్ని ప్రదర్శించడం అనేది ఎందుకనో వెస్ట్ భావజాలం లో ఒక తప్పు కాదు.అక్కడి రాణులు కావచ్చు..యువ రాణులు కావచ్చు ...చూసినట్టయితే వొళ్ళు అంతా శుబ్రంగా కప్పుకునేట్టు దుస్తులు ధరిస్తారు.కాని వక్ష సంపదని చాలా గర్వంగా చూపిస్తారు. అది మనకి అదోలా అనిపిస్తుంది.వారికి మాత్రం చాలా ఆహ్వానీయం.బాగా వారి సాహిత్యాన్ని చదివితే నాకు అనిపించింది ఏమంటే యవ్వనం అనేది పాశ్చ్యాత్యులకు చాలా ముఖ్యమైన విషయం.మగవాడు బలంగా ఓ గిత్త లా ఉండాలి..ఆడది అంటే ఆకర్షించే లా ఉండాలి.ఇది వారి ఆదర్శం.ఇది తప్పు లా కూడా నేను అనడం లేదు.ఒకానొక Plane లో ..భావ ప్రపంచం లో ఇది ఆమోదనీయమే.అన్ని ముసుగులు తొలగించి చూసినట్లయితే.

స్త్రీ పట్ల ఒక జెంటిల్ మెన్ ప్రవర్తన వారికి ఇలా ఉంటుంది.ఆమె సిగరెట్ కి లైటర్ ని పట్టడం..వస్తుంటే డోర్ ని తెరవడం...ఆమె చొరవ చూపిన పిమ్మటనే శృంగారానికి  సమాయత్తం కావడం...పక్కమీద కూడా మగవాని మీద కూర్చుని రమించడం ఇవన్నీ చాలా మర్యాద చూపే అంశాలు.కాని అదే మన భావ ప్రపంచం లో ఇవన్నీ స్త్రీలోలత్వానికి ..చిన్నతనానికి సంకేతం లా భావిస్తారు.

ఇవన్నీ ఒక్కరోజులో..లేదా ఒక శతాబ్దం లో వచ్చినవి కావు.దీని వెనుక వున్నది గ్ర్రీకు, రోమన్ నాగరికతల యొక్క ప్రభావం.ఆడవారిలో గాని..మగవారి లో గాని రజోగుణమే వారికి ఆదర్శనీయం.ఇది వారి జీవిత విధానం లో అణువు అణువు లో కనబడుతుంది.

ఒక మంత్రగాడు శక్తిస్వరూపిణి ని ఆవాహన చేసుకోవడానికి ఎలా భక్తి ప్రపత్తుడై ఉంటాడో స్త్రీకి యూరపు లో అలాంటి గౌరవం ఇస్తాడు మగవాడు అంటాడు వివేకానందుడు.అమెరికా నా దృష్టి లో యూరపు కి పుట్టిన చంటి బిడ్డ వంటిది.ఒక జీవితానుభవం పూర్తిగా  పొందిన తాత లాంటి వ్యక్తి తన మనవడిని ముందు పెట్టి కధ ఎలా  నడిపిస్తుంటాడో ప్రస్తుతం యూరపు లోని  దేశాలు చేసేది అదే..అమెరికా ని ముందు పెట్టి. Click here      

No comments:

Post a Comment