Monday, August 4, 2014

ఆ మధుర గాయకుని పుట్టినరోజు సందర్భంగా ఓ పాట-కొన్ని మాటలు

హిందీ చలన చిత్ర సీమ లో గాయకుడు కిషోర్ కుమార్ ఓ ప్రత్యేకమైన సంతకం.కేవలం గాయకుడి గానే కాదు దర్శకునిగా,నిర్మాత గా,గీత రచయిత గా,స్క్రీన్ ప్లే రచయిత గా తనదైన శైలి తో అలరించాడు.ముఖ్యంగా 1970-80 ల మధ్య అతనిది మహారాజ యోగం అని చెప్పాలి.రాజేష్ ఖన్నా,అమితాబ్,ధర్మేంద్ర,జితేంద్ర ఇలా ఒక్కరేమిటి అనేక మంది హీరోలకి ఎన్ని మరిచిపోలేని పాటలు అతను పాడింది...? లెక్క పెట్టి వాటి గురించి రాయాలంటే ఎంత రాసినా తక్కువే.కిషోర్ తనకి ముందున్న గాయకులకంటే ఓ విభిన్నమైన స్టైల్ ని సృష్టించాడు.ఉండుండి అతను ఫాల్స్ గొంతులో పాడి గమ్మత్తు చేసేవాడు.చిలిపి పాటలు,ప్రేమ పాటలు,విషాద గీతాలు... ఎన్ని షేడ్స్ లో పాడాడో లెక్కలేదు.ఒక గంభీరత తో కూడిన మధుర స్వరం అతనిది.ఆర్.డి.బర్మన్ మ్యూజిక్ లో అతను పాడినవి దుమ్మురేపే హిట్ సాంగ్స్.యమ క్రేజ్ ఉండేది వాళ్ళ కాంబినేషన్. అయితే నిజజీవితం లో చాలా గమ్మత్తు గా ఉండేది అతని ప్రవర్తన.రిపోర్టర్లు ఓసారి అతని స్నేహితుల గురించి అడిగితే నా కున్న నిజమైన స్నేహితులు నా గార్డెన్ లో ఉన్న చెట్లు..పూలు మాత్రమేనని చెప్పేవాడు.చెప్పడమేకాదు..వాటి తో మాట్లాడుతూ వుండేవాడట.పూర్తి పైకం చేతిలో పడందే పాట ససేమిరా పాడేవాడుకాదట.ఎవరైనా తనకి బాకీ ఉంటే పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి నలుగురుకీ వినబడేలా తన డబ్బులు ఎప్పుడిస్తావ్ అని గట్టిగా అరిచేవాడుట. ఓసారి అమితాబ్ కి,రాజేష్ ఖన్నా కి తాను పాడనని మొండికేశాడు.మళ్ళీ ఎలాగో నచ్చ్జెప్పి పాడించేవారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సంధర్భంగా నివాళులు అర్పిస్తూ ఇదిగో ఇక్కడ మీకోసం ఓ పాట.Click here

No comments:

Post a Comment