Tuesday, August 19, 2014

Mario Puzo నవల The God Father సంక్షిప్తీకరణ లో కొన్ని సరిగమలు(Part-2)

Mario Puzo నవల The God Father సంక్షిప్తీకరణ లో కొన్ని సరిగమలు(Part-2)

ఈరోజు 17 వ భాగాన్ని తెలుగు సంక్షిప్తీకరించి పోస్ట్ చేశాను గదా ..మొత్తం మీద 110 పేజీలు పూర్తి అయినవన్నమాట .! అసలు ఉన్న పేజీలు 443 ..అంటే ఇక ఎన్ని భాగాలు రాయవలసి ఉంటుందో చూడండి..నిజానికి ఈ నవల మొత్తాన్ని 9 Books గా, 32Chapters గా మేరియో ప్యూజో విభజించి రాశాడు.సరే మళ్ళీ దీనిలో Sub chapters గా కూడా విభజించారు. అయితే నేను సౌలభ్యం కోసం ఒక్కో పోస్ట్ ని ఒక్కో భాగం గా తీసుకుంటున్నాను.మన తెలుగు వారికి ఏ పద్ధతి లో చెబితే బాగుంటుందో ఆ దారిలో వెళుతున్నాను.

కొన్ని సినిమాల మాదిరిగా ముందుది వెనక్కి..వెనకది ముందుకి చాలా ట్రీక్కీ గా కధ నడుస్తూ ఉంటుంది.ఆ బాధలు సాధ్యమైనంత సులభ విధానం లో చెప్పాలనుకున్నా ..ఒక్కోమారు వీలుకుదరడం లేదు.అయితే చాలామంది ఈ సంవిధానాన్ని అర్ధం చేసుకుంటున్నారు..అందుకు సంతోషం..!ఉదాహరణకి..Luca Brasi హత్య విష్యమే చూడండి..అతడిని డాన్ పై కాల్పులు జరపడానికి ఒకరోజు ముందే ఆ హోటల్ లో చంపడం జరుగుతుంది.కాని దాన్ని చాలా revenge plan జరిగిన తరువాత వివరించడ్మ్ జరుగుతుంది.

అతదాకా ఎందుకు..అసలు గాడ్ ఫాదర్ అనబడే ఈ Don Vito Corleone ఏ సందర్భం లో అమెరికా దేశానికి..వస్తాడు.. ఎలా ఎదుగుతాడు అనేది ..ఇంకా చాలా ఆలశ్యంగా వస్తుంది. అది కూడా మంచి రసపట్టు గా ఉంటుంది.మణిరత్నం తీసిన నాయకుడు సన్నివేశాలు వాటిల్లోనుంచి చాలా చక్కగా adopt చేసుకున్నాడు..మనకి తగినట్లుగా..!

ఈ రోజు పోస్ట్ చేసిన దానిలో కూడా కొన్ని ఘాటు శృంగార సన్నివేశాలు ఉన్నాయి గాని ..కొంత ఎడిట్ చేశాను.అవి భీబత్సరసం లో కొంత తేలిపోతాయని ఇంకా నిడివి పెరుగుతుందని.సరే..ఈ నీలి చిత్రాల యుగం లో అవెంతలేగాని..!Click here

-- KVVS Murthy









     

No comments:

Post a Comment