Wednesday, September 10, 2014

పాట కి తగ్గ కొరియొగ్రఫీ ని ఎంచుకోవడం కూడా ఓ కళే..



ఈ మధ్హ్యానం అనుకోకుండా ఓ సినిమా పాట చూడాల్సివచ్చింది.అసలు ఈ మధ్య టి.వి.కూడా చూసి చాణ్ణాళయింది ఆ వార్తలు తప్ప ...మిగతావి అన్నీ సినిమా బేస్డ్ ..ఇంకా సీరియళ్ళే కదా..సరే బ్లాగు లోకం లో పడ్డాక టైం కూడా పెద్దగా ఉండటం లేదనుకోండి.

ఆ..సినిమా పాట గురించి కదా చెప్తుంటా..పాట లో కొన్ని ద్వంధర్ధాలు ఉన్నా ..ట్యూనింగ్ అదీ బాగుంది గదా విందాం ఉంచాను.నిజం చెప్పొద్దు..చాలా మధురంగా హాయిగా ఉంది..కళ్ళు మూసుకుని వింటుంటే..!

అంతలో కళ్ళు తెరిచి బుల్లితెర మీద చూద్దును గదా..పరమ గలీజు యాంగిల్స్ పెట్టి ..పరమ స్పీడుగా ..ఒక జాజ్ మ్యూజిక్ హోరుకి ఎగిరినట్టు గా అడ్డదిడ్డంగా ఎగురుతున్నారు.ఆ దర్శక,నిర్మాతల,హీరోల టేస్ట్ లకి ఓ నమస్కారం పెట్టి కళ్ళు మూసుకుని ఆ పాట విన్నాను.హాయిగా ఉంది.ఓ మంచి పాటకి మంచి కొరియోగ్రఫీ..అందునా ఆ భావాన్ని చెప్పే ది అయి ఉండటం ఎంత అవసరం..లేకపోతే ..సంగీత దర్శకుని శ్రమ కూడా చెత్తకుప్ప పాలే.Click here 

No comments:

Post a Comment