Thursday, September 11, 2014

ఈ పాట వినాలనుకున్నా ఎక్కడా దొరకడం లేదు..కాని మంచి పాట.



బహుశా 1979 లేదా ఎనభై ప్రాంతం లో ఓ సినిమా చూశాను.ఆ హీరో కూడా మళ్ళీ ఏ సినిమా లో కనబడినట్టు లేదు.అతని పేరు రఘురామి రెడ్డి ..ఆ సినిమా పేరు సినిమా పిచ్చోడు..పల్లె నుంచి చెన్నై(ఆ రోజుల్లో మద్రాస్) వెళ్ళి నానా అగచాట్లు పడి హీరో అవుతాడు.కధంతా ఆసక్తి గా బోరు కొట్టకుండా ఉంటుంది.ఆ రోజుల్లో ఓ మాదిరి హిట్ అయినట్టు గుర్తు.ఆ సినిమా కి,దర్శకుడు,నిర్మాత కూడా అతనే.దాంట్లో పాటలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా " నీవే నా పదమై,నీవే నా స్వరమై..కదలి రావే..ఒదిగి పోవే.."అని సాగుతుంది.మంచి సాహిత్యం..మంచి ట్యూను..దాన్ని వినాలని గూగుల్ లో నేను ఎంతో వెదికాను. మళ్ళీ నాకది ఇప్పటి దాకా లభ్యం కాలేదు. అయితే ఆ పాట గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు దూదిపింజ గా తేలిపోయినట్లుంటుంది.Click here 

1 comment:

  1. Murthy garu
    The song can be found at http://www.youtube.com/watch?v=P61tc8MPm7E

    ReplyDelete